సారాంశం
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఇప్పుడు పాన్ ఇండియ హీరో. కార్తికేయా 2 సినిమాతో ఓవర్ ఆల్ ఇండియాలో ఈ యంగ్ హీరో పేరు మారుమోగింది. దాంతో ఆయన ఇమేజ్ తో పాటు..డిమాండ్ కూడా పెరిగిందట.. అందుకే నిఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచినట్టు తెలుస్తోంది.
కార్తికేయ 2 సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. ప్రస్తుతం వరుస ప్యాన్ ఇండియా సినిమాలను లైన్ అప్ చేస్తూ.. కెరీర్ లో బిజీ అయిపోయారు. ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలు సిద్దువి లైన్ లో ఉన్నాయి. వాటిలో స్పై, స్వయంభూ, ఇండియా హౌస్ సినిమాలు ఇప్పటికే సెట్స్ మీద ఉన్నాయి. ఈ మూడు సినిమాలు కూడా ప్యాన్ ఇండియా సినిమాలు కావటం విశేషం. ఇక తనను పాన్ ఇండియా స్టార్ ను చేసిన కార్తికేయా సినిమాకు మూడో సీక్వెల్ ను కూడా త్వరలో సెట్స్ ఎక్కించబోతున్నాడు నిఖిల్.
కార్తికేయా3 తో పాన్ ఇండియా వైడ్ గా తన ఇమేజ్ ను భారీగా పెంచుకోవాలి అని చూస్తున్నాడు నిఖిల్ ఈలోపు ఆమూడు సినిమాలతో మరో ట్రైల్ వేయబోతున్నాడు. మొన్నటి వరకూ టాలీవుడ్ కు మాత్రమే పరిమితం అయిన నిఖిల్ ఇప్పుడు హిందీ మార్కెట్ ను కూడా ప్రభావితం చేయబోతున్నాడు. దాంతో నిఖిల్ రేంజ్ మారిపోవడంతో పాటు.. డిమాండ్ కూడా ఏర్పడింది. దాంతో ఈ ఛాన్స్ ను గట్టిగా ఉపయోగించుకోవాలి అని చూస్తున్నాడు నిఖిల్. అందులో భాగంగా తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచాలని డిసైడ్ అయ్యాడట.
ఇక సోషల్ మీడియాలో షికారు చేస్తున్న పుకార్ల ప్రకారం నిఖిల్ తన ప్యాన్ ఇండియా స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాకు దాదాపు 8 నుంచి 10 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారట. అంతేకాదు కొన్ని సినిమాల లాభాల్లో షేర్ కూడా అడుగుతున్నారట. నిఖిల్ అప్‌కమింగ్ మూవీ స్వయంభూ లాభాల్లో తనకు షేర్ కావాలని నిఖిల్ అడిగినట్టు సమాచారం. మరి నిఖిల్ నుంచి వచ్చే మూడుసినిమాలు హిట్ అయితే ఈరేటు ఇంకా ఎక్కువగా పెంచే అవకాశం ఉంది అంటున్నారు మేకర్స్. మరి ఈ న్యూస్ లో నిజం ఎంత ఉందో చూడాలి.