సినిమాల్లేక డిప్రెషన్ లోకి వెళ్లాను, హీరో నవీన్ చంద్ర కామెంట్స్ వైరల్..
సినిమాల వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళాను అంటున్నాడు హీరో నవీన్ చంద్ర. హీరోగా సినిమాలు చేస్తూనే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న ఈ యంగ్ హీరోకు.. డిప్రెషన్ కలిగేంత ఇబ్బందులు ఎందుకు వచ్చాయి.

అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. ఒక్క సినిమాతోనే బాగా పాపులర్ అయ్యాడు నవీన్ చంద్ర. వెంట వెంటనే అవకాశాలు రావ డంతో పాటు.. వరుసగా సినిమాలు కూడా చేసినా.. స్టార్ ఇమేజ్ కు మాత్రం దూరంగానే ఉన్నాడు నవీన్. హీరోగా నటించిన సినిమాలు సక్సెస్ అవుతున్నా..నవీన్ కు పెద్దగా కలిసి రాలేదు. అవకాశాలు వచ్చినా స్టార్ ఇమేజ్ మాత్రం రాలేదు. ఇక హీరోగా నటిస్తూనే.. క్యారెక్టర్ రోల్స్ కూడా చేయడం స్టార్ట్ చేశాడు. సెకండ్ హీరోగా.. స్టైలీష్ విలన్ గా నవీన్ తన కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.
నవీన్ చంద్ర హీరోగా .. హీరోగా చేసిన మంథ్ ఆఫ్ మధు' సినిమా, అక్టోబర్ 6వ తేదీన థియేటర్లకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన బిజీగా ఉన్నాడు. స్వాతి రెడ్డి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి శ్రీకాంత్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వెళ్తున్నాడు నవీన్ చంద్ర. అందులో భాగంగా ఓ మీడియా సంస్థతో మాట్లాడాడు నవీన్. అందులో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు.
తాజా ఇంటర్వ్యూలో నవీన్ చంద్ర మాట్లాడుతూ .. మా ఫాదర్ ఆర్టీసీలో మెకానిక్ గా చేసేవారు. నాకు మొదటి నుంచి సినిమాల పిచ్చి ఎక్కువగా ఉండేది. అదే నన్ను ఇక్కడి వరకూ తీసుకుని వచ్చింది. అంతకుముందు నాకు డాన్స్ మాత్రమే తెలుసు .. నటన తెలియదు. నాకు అవకాశం ఇచ్చిన దర్శకులే నాకు నటన నేర్పించారంటే కరెక్టుగా ఉంటుంది" అని అన్నాడు.
ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి రావడం వలన నిలదొక్కుకోవడానికి చాలా సమయం పట్టింది. దాంతో ఒకానొక సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. డిప్రెషన్ లో నుంచి బయటికి రావడానికి రెండేళ్లు పట్టింది. ఆ తరువాత నుంచి నన్ను నేను కరెక్టు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాను" అని చెప్పాడు. ప్రస్తుతం నవీన్ చంద్ర కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికీ హీరో పాత్రలు చేస్తూనే.. ఇంపార్టెన్స్ ఉన్న కెరెక్టర్ రోల్స్ కూడా చేసుకుంటూ వెళ్తున్నాడు నవీన్. ఇటు తెలుగతో పాటు.. అటు తమిళంలో కూడా మంచిమంచి అవకాశాలు సాధిస్తున్నాడు.