Asianet News TeluguAsianet News Telugu

హీరో ఆకాష్ పూరి పెళ్లి..? లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్న పూరీ జగన్నాథ్ తనయుడు..?

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది న్యూస్. ఇంతకీ ఆకాష్ చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా..?

Tollywood Director Puri Jagannadh Son Hero Akash Puri Wedding Rumours JMS
Author
First Published Dec 22, 2023, 11:06 AM IST

ఈమధ్య యంగ్ హీరోలంతా ఓ ఇంటివారు అవుతున్నారు. ఇప్పటికే ఈ ఏడాది వరుణ్ తేజ్, శర్వానంద్, మానస్ లాంటి స్టార్స్ పెళ్ళిళ్ళు చేసుకుని ఇంటివారు అయ్యారు. తాజాగా మరో యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడట. పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి పెళ్ళి చేసుకోబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. 

అయితే ఆకాశ్ పూరి లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. తన క్లాస్ మెట్ ను ఆకాశ్ పెళ్ళాడబోతున్నాడట. త్వరలో ఎంగేజ్ మెంట్ ఉంటుందని.. నెక్ట్స్ ఇయర్ పెళ్ళి ఉంటుందని అంటున్నారు.  పెళ్లికి ఇద్దరు కుటుంబ సభ్యులు ఒప్పుకున్న తర్వాతనే ఈ న్యూస్ అన్ అఫీషియల్ గా సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతుంది అంటున్నారు. అయితే అనౌన్స్ మెంట్ ఎప్పుడు ఇస్తారు అనేది తెలియాల్సి ఉంది. అంతే కాదు ప్రస్తుతం ఈన్యూస్ రూమర్ గానే ఉంది. ఈ విషయంలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే కాని అసలు విషయం తెలుస్తుంది. 

Tollywood Director Puri Jagannadh Son Hero Akash Puri Wedding Rumours JMS

ఇక ఆకాశ్ పూరీ పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి.. ఓ పాపులర్ పొలిటికల్ సీనియర్ లీడర్  మనవరాలుగా తెలుస్తుంది. కోట్ల ఆస్తికి వారసురాలు అయిన ఆ అమ్మాయి ఆకాశ్ ను ప్రేమించిందట.  ఆకాశ్ గురించి అందరికి తెలిసిందే. టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయ్యాడు. నటనలో స్టార్స్ ను మించిపోయాడు. చిన్నతనంలోనే ఆకాశ్ నటనకు ఆడియన్స్ ముగ్దులైపోయారు. అయితే ఓ వయస్సుకు వచ్చాక హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆకాశ్. కాని హీరోగా హిట్ మాత్ర కొట్టలేకపోయాడు. ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు ఆశాల్. 

ఇక ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా వెలుగు వెలిగాడు పూరీ జగన్నాథ్. మహేష్ బాబు, రవితేజ,  పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ కు హీరోగా లైఫ్ ఇచ్చింది పూరీనే. ఇక ఇండస్ట్రీలో వెలుగు వెలిగి.. ఎందరో సాధారణ హీరోలను స్టార్ హీరోలుగా చేసిన పూరీ.. ప్రస్తుతం ఫెయిల్యూర్స్ తో కాలం వెల్లదీస్తున్నాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్.. తనకు సెకండ్ ఇన్నింగ్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు. డబుల్ ఇస్మార్ట్ టైటిల్ తో ఈమూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందీ సినిమా. 
 

Follow Us:
Download App:
  • android
  • ios