టాలీవుడ్ సినీ నిర్మాత అనీల్ కుమార్ కన్నుమూశారు. రాధా గోపాలం, అల్ల‌రి బుల్లోడు, శ్రీరామ చంద్రులు, ఒట్టేసి చెబుతున్నా వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌కు అనీల్ నిర్మాతగా వ్యవహరించారు. 

గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయ‌న మృతికి టాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.  హీరో నాని త‌న ట్విట్ట‌ర్ ద్వారా అనీల్ కుమార్ మృతి ప‌ట్ల సంతాపం తెలియ‌జేస్తూ.. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని వివరించారు.

 అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేస్తున్న స‌మ‌యంలో అనీల్ కుమార్ సంత‌కంతో తొలి జీతం అందుకున్న‌ట్టు నాని తెలిపారు . నా తొలి నిర్మాత‌, నా ఫ్యామిలీ, నా మెంట‌ర్‌. ఆయ‌న‌ని మిస్ కావ‌డం బాధ‌గా ఉంది. ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని ప్రార్ధిస్తున్నాను అని నాని పేర్కొన్నారు. అలానే అల్ల‌రి నరేష్ కూడా త‌న ట్విట్ట‌ర్ ద్వారా అనీల్ కుమార్ మృతికి సంతాపం తెలిపారు.