అందాలు ఆరబోసే ముద్దుగుమ్మలు రాజ్యం ఏల గలిగే పరిశ్రమ టాలీవుడ్. భాష ఏదయినా, ప్రాంతం ఏదైనా సరే.. అందం చిందిస్తే చాలు ఇక్కడి ప్రేక్షకులు అందలం ఎక్కించేస్తారు. అందాల భామలంతా తమ సొత్తే అనుకుని ఆదరిస్తారు. అందుకే టాలీవుడ్ లో పరభాషా హీరోయిన్లకు అత్యంత ఆదరణ లభిస్తుంది. మరి ఇప్పుడు టాలీవుడ్ లో ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు. ఏ హీరోయిన్ రేటు ఎంత తెలుసుకుందామా..

అభినయంతో ఆకట్టుకునే నటి నిత్యామీనన్ సినిమాకు 90 లక్షల వరకూ వసూలు చేస్తోందట.

 

ఇక బాహుబలిలో అవంతికగా అవతరించిన తమన్నా భాటియా కూడా దాదాపు ఇంతే రేటు వసూలు చేస్తోందట. ఆ మధ్య కాస్త రేటు పెంచిన ఇప్పుడు తీసుకుంటున్నది మాత్రం 90 లక్షలేనట. ఇక తమిళ సుందరాంగులు త్రిష, నయనతార ఒక్కో తెలుగు సినిమాకు కోటి రూపాయల వరకూ  తీసుకుంటున్నారని టాక్. పెద్దగా హిట్లు లేని శ్రుతి హాసన్.. వరుస అవకాశాలతో దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ .. వీరిద్దరూ కోటి రూపాయల పారితోషకం జాబితాలో ఉన్నారు. శ్రుతిహాసన్ కు సక్సస్ లేకపోయినా రేటు మాత్రం తగ్గలేదండోయ్.. 

 

ఇక టాప్ హీరోయిన్స్ విషయానికి వస్తే కాజల్ అగర్వాల్, సమంతా వీరిద్దరూ సినిమాకు రెండు కోట్లు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సమంతా పెళ్లయినా రేటు మాత్రం బాగానే పలుకుతోంది. 

 

ఇక టాలీవుడ్ లో టాప్ పేయింగ్ ఆర్టిస్ట్ ఎవరంటే.. ఆమే అనుష్క శెట్టి.. ఈమె సినిమాకు 4 కోట్లు వసూలు చేస్తోందట. బాహుబలి, రుద్రమదేవి లాంటి బంపర్ హిట్లతో అనుష్క శెట్టి క్రేజ్ ఏపాటిదో తెలుస్తోంది. భాగమతి వంటి సినిమాను ఒక్క చేత్తో నిలబెట్టిన అనుష్కకు నాలుగు కోట్లు ఇవ్వడంలో ఆశ్చర్యంలేదు.