పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి చిత్రంతో పూరి తన సినీ కెరీర్ ని దర్శకుడిగా ప్రారంభించారు. బద్రి సూపర్ హిట్ కావడంతో మరిన్ని అవకాశాలు ఈ డాషింగ్ డైరెక్టర్ ని వెతుక్కుంటూ వచ్చాయి. ఇడియట్ చిత్రం పూరీని టాలీవుడ్ లో ప్రధాన దర్శకుడిగా మార్చేసింది. 

అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి లాంటి వరుస హిట్లతో పూరి స్టార్ హీరోలందరికీ ఫేవరిట్ డైరెక్టర్ గా మారిపోయారు. ఇక సూపర్ స్టార్ మహేష్ తో తెరకెక్కించిన పోకిరి చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఆ తర్వాత చిరుత, దేశముదురు చిత్రాలతో పూరి తన జైత్ర యాత్రని కొనసాగించారు. 

మధ్యలో ఎదురైనా కొన్ని పరాజయాలతో పూరి కెరీర్ కాస్త నెమ్మదించింది. కానీ ఇటీవల విడుదలైన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో పూరి సత్తా మరోసారి బయటపడింది. ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఘనవిజయం సాధించింది. పూరి జగన్నాధ్ బర్త్ డే సందర్భంగా సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.