మెగాస్టార్ చిరంజీవి.. ఈ నెల(ఫిబ్రవరి) 10న ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నేపథ్యంలో రేపు(మంగళవారం) జరగాల్సిన టాలీవుడ్ పెద్దల మీటింగ్‌కి ప్రాధాన్యత సంతరించుకుంది.
టాలీవుడ్ సినీ పెద్దల సమావేశం వాయిదా పడింది. రేపు(మంగళవారం) తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో జరగాల్సిన మీటింగ్‌ని వాయిదా వేశారు. పరిశ్రమలోని పలువురు పెద్దలు అందుబాటులో లేకపోవడంతో ఈ మీటింగ్‌ని వాయిదా వేసినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ మీటింగ్‌పై కొందరు పెద్దల నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో ఈ మీటింగ్‌ని వాయిదా వేసినట్టు తెలుస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి.. ఈ నెల(ఫిబ్రవరి) 10న ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నేపథ్యంలో రేపు(మంగళవారం) జరగాల్సిన టాలీవుడ్ పెద్దల మీటింగ్‌కి ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగనుండగా, ఇందులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్‌బాబు వంటి పెద్దలు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఇప్పుడది వాయిదా పడటం గమనార్హం.
ఏపీలో సినిమా టికెట్స్ రేట్స్, ఇతర సినిమా సమస్యలు నెలకొన్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌కి, ఏపీ ప్రభుత్వానికి మధ్య వివాదం నెలకొంది. కొందరు టాలీవుడ్ ప్రముఖులు ఏపీలో టికెట్ల రేట్లపై విమర్శలు చేయగా, అటు ఏపీ ప్రభుత్వ పెద్దలు సైతం టాలీవుడ్‌పై విమర్శలు చేశారు. పెద్ద హీరోల పారితోషికంపై, నిర్మాతలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే దీనిపై కొందరు సినీ ప్రముఖులు ఘాటుగానే స్పందించారు.
అయితే ఈ వివాదంలోకి రామ్‌గోపాల్ వర్మ ఎంట్రీ ఆసక్తిగా మారింది. ఆయన మంత్రి పేర్ని నానితో సమావేశయ్యారు. మీటింగ్ అనంతరం కూడా వీరిద్దరి మధ్య ట్వీట్ల వార్ సాగింది. ఏపీ ప్రభుత్వంపై ట్వీట్లతో విరుచుకుపడ్డారు వర్మ. టికెట్ల రేట్లు తగ్గించే హక్కు, సినిమాలను నిర్ణయించే హక్కు ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదం మరింతగా పెరిగింది. అనంతరం ఏపీ సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ అయ్యారు. దీనిపై జగన్ చాలా సానుకూలంగా స్పందించారని, సినిమాకి సంబంధించిన పాజిటివ్ నిర్ణయాలు త్వరలోనే జరుగుతాయని, అందరికి మేలు జరుగుతుందని, ఇండస్ట్రీ బిడ్డగానే సీఎంని కలిశానని చిరంజీవి తెలిపారు.
మరోవైపు సినీ ప్రముఖుల భేటీ నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్(మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. తిరుపతితో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమా టికెట్ల ధరలు తెలంగాణలో పెంచారని.. ఏపీలో తగ్గించారని చెప్పారు. సినిమా టికెట్ల ధరలపై సినీ పరిశ్రమ ఏకతాటిపైకి రావాలని అన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం మేరకు ముందకెళ్తామని చెప్పారు. రెండు ప్రభుత్వాలు సినీ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తున్నాయని అన్నారు.
చిరంజీవి, సీఎం జగన్ మీటింగ్‌కు సంబంధించి విష్ణు స్పందిస్తూ అది చిరంజీవి వ్యక్తిగత మీటింగ్ అని వ్యాఖ్యానించడం వివాదంగా మారిన విషయం తెలిసిందే. పెద్దలు అంటే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్‌బాబు, నాగార్జున అని, వాళ్లతో పాటు ఇతర విభాగాల వారు కలిసి దీనిపైకలిసి నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు.
