ఆర్ ఆర్ ఆర్(RRR movie), రాధే శ్యామ్ చిత్రాలు విడుదల వాయిదా ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే సమ్మర్ మాత్రం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల విడుదలతో సినీ ప్రియులు నాన్ స్టాప్ గా ఎంజాయ్ చేయనున్నారు. కాగా టాలీవుడ్ బడా చిత్రాలన్నీ మూకుమ్మడిగా విడుదల తేదీలు ప్రకటించాయి.
కరోనా దెబ్బతో అందరి పనులు అటకెక్కాయి. ప్రణాళికలు తారుమారయ్యాయి. భారీ చిత్రాలతో కళకళలాడాల్సిన సంక్రాంతి వెలవెలబోయింది. బంగార్రాజు మినహాయిస్తే విడుదలైన చిన్న చిత్రాలు నిరాశపరిచాయి. ఆర్ ఆర్ ఆర్(RRR movie), రాధే శ్యామ్ చిత్రాలు విడుదల వాయిదా ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే సమ్మర్ మాత్రం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల విడుదలతో సినీ ప్రియులు నాన్ స్టాప్ గా ఎంజాయ్ చేయనున్నారు. కాగా టాలీవుడ్ బడా చిత్రాలన్నీ మూకుమ్మడిగా విడుదల తేదీలు ప్రకటించాయి.
చడీ చప్పుడు లేకుండా రిలీజ్ డేట్ అప్డేట్స్ ఇచ్చేశాయి. ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ మార్చ్ 25న చిత్ర విడుదల అంటూ అధికారిక ప్రకటన చేసిన వెంటనే మిగతా చిత్రాలు క్యూ కట్టాయి. గంటల వ్యవధిలో ఆచార్య, సర్కారు వారి పాట, ఎఫ్ 3, బీమ్లా నాయక్ (Bheemla nayak)అప్డేట్స్ ఇచ్చాయి. ఏదో ఎర్ర బస్సులో సీటు కోసం కిటికీలోంచి కర్చీఫ్ వేసినట్టు.. ఈ డేట్ నాది ఈ డేట్ నాది అంటూ ప్రకటించారు. భీమ్లా నాయక్ నుండి సర్కారు వారి పాట వరకు అందరూ తేదీలు కన్ఫర్మ్ చేశారు.
ఎప్పటిలాగే రాధే శ్యామ్(Radhe Shyam)యూనిట్ నిద్రపోతుంది. మీరు ప్రకటించుకోండి.. నిదానంగా మేము కూడా తెలియజేస్తామన్నట్లు గుట్టుగా ఉన్నారు. అయితే మేకర్స్ మైండ్ లో ఓ డేట్ ఫిక్స్ అయిందట. మార్చ్ 11న రాధే శ్యామ్ విడుదల చేయనున్నారన్నారట. అంటే భీమ్లా నాయక్ విడుదలకు రెండు వారాల ముందన్న మాట.
విడుదల తేదీ కోసం మీనమేషాలు లెక్కించి చాలా జాగ్రత్తగా డిసైడ్ చేసే రోజులు పోయాయి. పదుల సంఖ్యలో సినిమాలు విడుదలకు క్యూ లైన్ లో ఉన్నాయి. ఆదమరిచి ఆలస్యం చేస్తే అసలు స్లాట్ దొరకడమే కష్టం. కాసులు కురిపించే సంక్రాంతిని మిస్ అయిన పెద్ద సినిమాలు కనీసం సమ్మర్ లో అయినా వసూళ్లు దులుపుకుందాం అనుకుంటున్నాయి. కాబట్టి ముందుగా బుక్ చేసుకున్నవారిదే డేట్. పరిస్థితి చాలా టైట్ గా ఉంది. అందులోనూ అన్నీ పెద్ద సినిమాలు. నాకు కూడా చోటివ్వండం , మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి, ముందుకు వెళ్ళండి అనే పరిస్థితి లేదు.
ఈ కారణంగానే టాలీవుడ్ పెద్ద చిత్రాలు తమతమ విడుదల తేదీలు లాక్ చేశాయి. మరి సమ్మర్ బరిలో దిగుతున్నామంటూ అందరికంటే కెజిఎఫ్ మేకర్స్ చెప్పారు. ఆ చిత్రానికి కూడా సమ్మర్ లోనే ఒక డేట్ ఇవ్వాలి. పెద్ద చిత్రాల పోటీ మధ్య డబ్బింగ్ మూవీ కెజిఎఫ్ కి చోటు దొరుకుంతుందో లేదో చూడాలి. ఇక ప్రకటించిన కొత్త సినిమా డేట్స్ పరిశీలిస్తే భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న లేదంటే ఏప్రిల్ 1. సర్కారు వారి పాట మే 12న. ఆర్ ఆర్ ఆర్ మార్చ్ 25న, ఆచార్య ఏప్రిల్ 29న, ఎఫ్ 3 ఏప్రిల్ 28న విడుదల కానున్నాయి. రాధే శ్యామ్ మార్చ్ 11న, కెజిఎఫ్ ఏప్రిల్ 14న విడుదల కానున్నాయని సమాచారం.