Asianet News TeluguAsianet News Telugu

MAA Election: ఓటింగ్‌కి దూరంగా ఉన్న ప్రభాస్‌, మహేష్‌, ఎన్టీఆర్‌, బన్నీ, సమంత, కాజల్‌, రకుల్‌.. విమర్శలు

ఓ వైపు ఓట్ల లెక్కింపు జరుగుతుంటే, మరోవైపు ఓట్లు వేయని వారికి సంబంధించిన వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. స్టార్‌ హీరోలు, హీరోయిన్లు ఓటింగ్‌ వినియోగించుకోకపోవడం, ఓటింగ్‌కి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. 

tollywood big stars not attended for maa election voting
Author
Hyderabad, First Published Oct 10, 2021, 6:28 PM IST

`మా` ఎన్నికల ఉత్కంఠ పీక్‌లోకి వెళ్లింది. ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని నెలకొంది. ప్రస్తుతం ఓటింగ్‌ జరుగుతుంది. మొదట లెక్కించిన పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లలో మంచు విష్ణు ఆధిక్యంలో ఉన్నారని ఎన్నికల అధికారులు ప్రకటించారు.  `మా` చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. 75శాతం పోల్‌ అయినట్టు తెలుస్తుంది. 883ఓట్లకుఇ 665 ఓట్లు నమోదు కావడం మా చరిత్రలోనే రికార్డ్ గా చెబుతున్నారు. 

ఈ నేపథ్యంలో ఓ వైపు ఓట్ల లెక్కింపు జరుగుతుంటే, మరోవైపు ఓట్లు వేయని వారికి సంబంధించిన వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. స్టార్‌ హీరోలు, హీరోయిన్లు ఓటింగ్‌ వినియోగించుకోకపోవడం, ఓటింగ్‌కి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్‌, వెంకటేష్‌, నాగచైతన్య, అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌, వైష్ణవ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌, ప్రభాస్‌, మహేష్‌, గోపీచంద్‌, రవితేజ, నాగశౌర్య ఇలా చాలా మంది హీరోలు ఓట్‌ వేసేందుకు రాలేదు. 

మరోవైపు హీరోయిన్లలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కాజల్‌, రాశీఖన్నా, సమంత, అనుష్క, కీర్తిసురేష్‌, ప్రగ్యాజైశ్వాల్‌, రష్మిక మందన్నా, అను ఇమ్మాన్యుయెల్‌, అదితి రావు హైదరీ, తమన్నా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోయిన్ల లిస్టే ఉంది. వీరంతా ఓట్‌ వేసేందుకు రాలేదు.  `మా` ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా, వివాదంగా మారిన నేపథ్యంలో ఇరు ప్యానెల్‌ సభ్యులు ఎన్నికలను సీరియస్‌గా, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 

also read: Maa Elections: ‘‘ మా ’’ చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో పోలింగ్.. ఫలితాలపై ఉత్కంఠ

కానీ బాధ్యతగల ఈ సెలబ్రిటీలు ఓటు హక్కు వినియోగించుకోకపోవడం విమర్శలకు తావిస్తుంది. అదే సమయంలో ఈ సారి ఎన్నికలు వివాదం పీక్ లోకి వెళ్లిన నేపథ్యంలో తాము ఎన్నికలకు దూరంగా ఉండాలని ఈ తారలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios