Asianet News TeluguAsianet News Telugu

సిక్కింలో క్షేమంగానే నటి సరళ కుమారి, హైదరాబాద్ చేర్చాలంటూ విన్నపం..

సిక్కిం వరదల్లో ఆచూకీ లేకుండా పోయారంటున్న తెలుగు సీనియర్ నటి సరళకుమారి అక్కడ క్షేమంగా ఉన్నట్టు సమాచారం అందుతోంది. అయితే ఆమె హైదరాబాద్ రావడం కోసం సహాయం చేయాలని అడుగుతున్నట్టు తెలుస్తోంది. 
 

Tollywood actress sarala kumari safe in sikkim JMS
Author
First Published Oct 8, 2023, 1:06 PM IST

సిక్కిం వరదల్లో ఆచూకీ లేకుండా పోయారంటున్న తెలుగు సీనియర్ నటి సరళకుమారి అక్కడ క్షేమంగా ఉన్నట్టు సమాచారం అందుతోంది. అయితే ఆమె హైదరాబాద్ రావడం కోసం సహాయం చేయాలని అడుగుతున్నట్టు తెలుస్తోంది. 

టూరిస్ట్ గా సిక్కిం పర్యటనకు వెళ్లిన  టాలీవుడ్ సీనియర్  నటి, కూచిపూడి నృత్యకారిణి సరళ కుమారి క్షేమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ముందు ఆమె ఆచూకి తెలియకపోవడంతో.. గల్లంతయ్యి ఉంటారని అంతా భావించారు. తన కూతురు ముందుగా అందించిన సమాచారం ప్రకారం కమ్యూనికేషన్ కట్ అవ్వడంతో.. ఆమె గురించిన వివరాలు తెలియలేదు. దాంతో తెలంగాణ ప్రభుత్వానికి ఆమె తనయురాలు..అమెరికా నుంచి రిక్వెస్ట్ పెట్టారు. అయితే తాజాగా ఆమె క్షేమంగా ఉన్నట్టు ఆమె కుమార్తె నబిత వెల్లడించారు. 

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ప్రాంతంలో ఉండే సరళకుమారి ఈ నెల 2న స్నేహితులతో కలిసి సిక్కిం పర్యటనకు వెళ్లారు. అమెరికాలో ఉంటున్న కుమార్తె నబితకు ఈ విషయం చెప్పారు. 3న ఆమె మరోమారు కుమార్తెతో మాట్లాడారు.అయితే, ఆ తర్వాత మాత్రం ఆమె ఆచూకీ గల్లంతైంది. తల్లితో మాట్లాడేందుకు నబిత చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అక్కడ అకస్మాత్తుగా సంభవించిన వరదల్లో ఆమె గల్లంతై ఉంటారని భావించారు. తన తల్లి ఆచూకీని గుర్తించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు వార్తలు వచ్చాయి. ఆర్మీ హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేసినా కలవడం లేదని, తన తల్లి ఎక్కడుందో ఆచూకీ కనుక్కోవాలని విజ్ఞప్తి చేశారు. 

 సిక్కింలోని లాచెన్ ప్రాంతంలో తన తల్లి సురక్షితంగా ఉన్నట్టు నబిత తెలిపారు. అక్కడి నుంచి ఆమెను హైదరాబాద్ తరలించే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, డీజీపీ అంజనీ కుమార్ స్పందించి సాయం చేయాలని వేడుకున్నారు. ఇక సరళ కుమారి చేసింది తక్కవు సినిమాలే అయినా.. మంచి గుర్తింపు ఉన్న సినిమాలు చేసింది. 1983లో మిస్ ఏపీగా ఎంపికైన సరళకుమారి మోడల్‌గా కెరియర్ ప్రారంభించారు. ఆ తర్వాత చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు.   మరీ ముఖ్యంగా  ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ 'దాన వీర శూర కర్ణ'లో నటించారు. సంఘర్షణ తదితర సినిమాల్లోనూ నటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios