`నిన్ను కలిశాక`, `బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌`, `దళం` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ని పలకరించిన పియా బాజ్‌పాయ్‌ సోదరుడు కన్నుమూశారు. కరోనాతో పోరాడుతున్న ఆయన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

`నిన్ను కలిశాక`, `బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌`, `దళం` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ని పలకరించిన పియా బాజ్‌పాయ్‌ సోదరుడు కన్నుమూశారు. కరోనాతో పోరాడుతున్న ఆయన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తన సోదరుడి పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉందని, ఎవరైనా సహాయంచేయాలని ఆమె గత నాలుగు గంటలుగా సోషల్‌ మీడియాలో మొర పెట్టుకుంటుంది. ఓ వ్యక్తి స్పందించారు. కానీ అతను కాంటాక్ట్ కలవకపోవడం, సరైన కమ్యూనికేషన్‌ కలగకపోవడంతో, ఆమె సహాయం చేయాలని వేడుకోవడం కలచివేస్తుంది. 

Scroll to load tweet…

ఈ క్రమంలోనే సరైన సమయంలో తనకు బెడ్‌, వెంటిలేటర్‌ దొరక్కపోవడంతో చివరికి తుది శ్వాసవిడిచారని తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఫరుఖాబాద్‌ ఖయ్యుమ్‌ గంజ్‌ బ్లాక్‌లో ఉన్నారని, ఎవరైనా సహాయం చేయాలని నటి పియా బాజ్‌పాయ్‌ తల్లడిల్లిపోయారు. `నా బ్రదర్‌ చనిపోతున్నాడు, బెడ్‌, వెంటిలేటర్‌ అందించండి. ఎవరైనా హెల్ప్‌ చేయండి` అంటూ ఆమె పదే పదే పోస్ట్ లు పెడుతూ వస్తూ వచ్చారు. అయినా లాభం లేదు. ఆమె సోదరుడు కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్‌ ద్వారే తెలిపారు. ప్రస్తుతం ఆమె ట్వీట్లు ఇప్పుడు అందరిని కలచివేస్తున్నాయి. కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. 

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…