సారాంశం

టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి సంచలన ఆరోపణలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని.. తనను చంపాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..? 

ఏదో ఒక విధంగా వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది నటి కరాటే కల్యాణి. గత కొద్ది కాలంగా వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనంగా మారిన కళ్యాణి  మరో సారి వార్తల్లో నిలిచారు. ఈసారి  తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ  ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణి ఈ వ్యాఖ్యలు చేశారు. కరాటే కల్యాణి మాట్లాడుతూ.. నాకు ప్రాణ హాని ఉంది. ఈ మధ్యనే నా కారు రెండు టైర్లను గుర్తు తెలియని వ్యక్తులు కోసేశారు. తెలియకుండా నేను ప్రయాణించాను. ఓ చిన్న రోడ్డులో వెళ్ళేప్పుడు ఆ కారు టైర్లు పేలిపోయాయి..అదే హైవే మీది ప్రయాణించి ఉంటే నాపరిస్థితి వేరేలా ఉండేది.  ఈ మధ్యన హిందుత్వ వాదులతో కలసి కార్లో ఏదో గుడి దగ్గర గొడవ జరుగుతుంది అంటే నా కార్ లో వెళ్లా. అటు నుంచి వస్తుంటేనే ఇది జరిగింది అన్నారు. 

కారు చెక్ చేసి..  టైరును పరీక్షించిన  మెకానిక్ లు ముందే ఎవరో కార్ టైరును కొంచెం కోసేశారని చెప్పారు. నా మీద కోపం తోనే ఎవరో కావాలని అలా చేశారు. నాకు ప్రాణ హాని ఉంది అంటూ ఆరోపణలు చేశారు. ఇక కళ్యాణి గత కొంత కాలంగా వివాదాలతో గేమ్స్ ఆడుతున్నారు. ఖమ్మంలో ప్రతీష్టించాలి అనుకున్న ఎన్టీఆర్ విగ్రహం .. కృష్ణుడి రూపంలో ఉంది అని ఆమె రచ్చ రచ్చ చేశారు. చివరకు కోర్డు నుంచి స్టే కూడా తీసుకువచ్చారు. అంతే కాదు  ఎన్టీఆర్‌ చాలా సినిమాల్లో చాలా వేశాలు వేశారు..  ఎన్నో గొప్ప పాత్రలతో మెప్పించారు.అలాగని అన్ని పాత్రలతో, అన్ని వేషాలతో విగ్రహాలు ఏర్పాటు చేస్తామా? కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్‌ విగ్రహం చూస్తే.. పిల్లలు కృష్ణుడు అంటే ఎన్టీఆర్‌ అనుకుంటారు. అని వాదించారు కళ్యాణి. 

చివరకు ఆమెకు మా అసోషియేషన్ నుంచి షోకాజులు వచ్చినా.. తగ్గలేదు.. ఇక రీసెంట్ గా మా నుంచి కళ్యాణిని సస్పెండ్ చేశారు. అయినా తగ్గేది లేదు అంటున్నారు కళ్యాణి. ఇంతకు ముందు తన ఇంట్లో ఉన్న పిల్లల గురించి రోడండుకెక్కింది కళ్యాణి. తాను పిల్లలను దత్తత తీసుకున్నానని.. తీసుకోబోతున్నానని.. ఇలా రనకరకాలుగామాట్లాడి.. పెద్ద రచ్చ జరిగేలు ప్లాన్ చేసుకున్నారు. దాంతో కొన్నిరోజులు కరాటేకళ్యాణి హాట్ టాపిక్ గామారింది. ఇక ప్రస్తుతం పొలిటికల్ గా బాగా యాక్టీవ్ అవుతోంది కరాటే కళ్యాణి.