Asianet News TeluguAsianet News Telugu

నటుడు బ్రహ్మాజీ సంచలన వ్యాఖ్యలు.. చిల్లర కామెంట్స్ చేస్తున్నారంటున్న నటుడు

సంచలన వ్యాఖ్యలు చేశారు నటుడుబ్రహ్మాజీ.  ఆంధ్రోడా అంటూ చిల్లర కామెంట్లు చేశారంటు బ్రహ్మాజీ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆయన్ను ఆ మాటులు ఎవరు అన్నారు..? ఏంటి సంగతి...?
 

Tollywood Actor Brahmaji Sensational Comments JMS
Author
First Published Jul 18, 2023, 3:46 PM IST


టాలీవుడ్ లో.. స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు బ్రహ్మాజీ. కామెడీ నటుడుగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందల సినిమాలు చేశాడు బ్రహ్మాజీ  గులాబీ సినిమాలో విలన్ పాత్రలో మెప్పించి, నిన్నే పెళ్లాడతా లాంటి సినిమాలతో బాగా ఫేమస్ అయ్యాడు బ్రహ్మాజీ. కృష్ణవంశీ..  సింధూరం సినిమాతో  హీరోగా కూడా నటించిన  బ్రహ్మజీ.. ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. 

సీరియస్ పాత్రలతో పాటు కమెడియన్‌గా కూడా పాపులర్ అయ్యాడు బ్రహ్మాజీ. ఇక బ్రహ్మాజీ వేదికలపై చేసే ఫన్.. సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ లు..  బాగా ఫేమస్. ఫన్నీ కామెంట్లతో నవ్వులు పూయించేలా చేస్తుంటాడు బ్రహ్మాజీ. ఫిల్మ్ ఇండస్ట్రీలో.. బ్రహ్మాజీ ఓ ప్రత్యేక స్థానం సంపాదించడంతో పాటు..  ఆయనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా బ్రహ్మాజీ వేసే సెటైర్లు.. వింటుంటే వినబుద్ది అవుతుంది. నవ్వని వారికి కూడా నవ్వు తెప్పిస్తుంది. 

అంతే కాదు అప్పుడప్పుడు బ్రహ్మాజీ పెట్టే ట్వీట్లు.. సంచలనంగా మారుతుంటాయి.. ఒక్కోసారి పెనుదుమారాన్ని సృష్టిస్తుంటాయి. తాజాగా ఆయన చేసిన ట్వీట్ పలు విమర్షలకు దారి తీస్తుంది. నెట్టింట్లో పెను దుమారం రేపింది. ఏకంగా ఆయనకు వ్యతిరేకంగా ట్వీట్లు పెట్టేలా చేసింది. ఇంతకీ ఆయన అంతలా ఏమన్నారు.. దానికి ఆయన ఇచ్చిన వివరణ ఏంటి..? 

బ్రహ్మజీ కుమారుడు సంజయ్ రావ్ హీరోగా నటిస్తున్న చిత్రం స్లమ్ డాగ్ హస్బెండ్. ఈ నెల 29న థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు బ్రహ్మాజీ. ఈ సందర్భంగా గతంలో ఓ సారి బోటు కొనాలనుకుంటున్నాను.. సూచనలు ఇవ్వండి అని ట్వీట్ చేశారు. దీనిపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఎందకు, ఏ పరిస్థితుల్లో తాను ఏ ట్వీట్ చేయాలో చెప్పాడు బ్రహ్మజీ.  ఇటీవల హైదరాబాద్‌లో వర్షాలు కురిశాయి. భారీ వర్షం కురిసింది. నేను నా భార్యలో కారులో ఉన్నాం. ఇంటికి వెళ్లే దారులన్నీ నీటితో నిండిపోయాయి. దగ్గరలో తెలిసిన వారింట్లో కారు పార్క్ చేసి పక్కనే ఉన్న వంతెన మీదుగా మా ఇంటికి చేరుకున్నాం. ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు మాకు సాయం చేశారు అని తెలిపారు.

ఇదే విషయాన్ని తాను కాస్త సెటైరికల్‌గా బోట్ కొనాలనుకుంటున్నానని, అభిప్రాయాలు కోరానన్నారు బ్రహ్మాజీ. దానికి హైదరాబాద్ రెయిన్ అనే ట్యాగ్ చేశానన్నారు. దానికి తనపై చాలా దారుణంగా ట్రోల్ చేశారంటూ తెలిపారు. ఆంధ్రోడా అంటూ చిల్లర కామెంట్లు పెట్టారని, తాను వివరణ ఇచ్చినప్పటికీ.. కామెంట్స్ ఆగలేదని పేర్కొన్నారు. అందుకే కొంతకాలంగా ట్విట్టర్ కు దూరంగా ఉంటున్నానని చెప్పారు.  

Follow Us:
Download App:
  • android
  • ios