వివాదాస్పద, సంచలన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న రామ్‌గోపాల్‌ వర్మ పుట్టిన రోజు నేడు(ఏప్రిల్‌7). ఈ సందర్భంగా వర్మకి పలువురు సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

తనకిది బర్త్ డే కాదు, డెత్‌ డే అంటున్నారు వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. అంతేకాదు పుట్టిన రోజు వేళ కన్నీళ్లు పెడుతున్నాడు. మరి వర్మకి ఏమైంది? ఎందుకీ కామెంట్‌ చేస్తున్నాడనేది చూస్తే.. వివాదాస్పద, సంచలన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న రామ్‌గోపాల్‌ వర్మ పుట్టిన రోజు నేడు(ఏప్రిల్‌7). ఈ సందర్భంగా వర్మకి పలువురు సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన టాలెంట్‌ని ప్రశంసిస్తున్నారు. తమని ఇన్‌స్పైర్‌ చేసిన దర్శకుడు అంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. 

దీనికి వర్మ స్పందిస్తూ, ఈ రోజు నా పుట్టిన రోజు కాదని ట్వీట్‌ చేశాడు. `ఈ రోజు నా బర్త్ డే కాదు. డెత్‌ డే. ఎందుకంటే నా ఆయుష్షులో ఒక సంవత్సరం తగ్గిపోయింది` అని ట్వీట్‌ చేశాడు. ఈ సందర్భంగా ఆయన ఏడుస్తున్న ఎమోజీలు పంచుకున్నాడు. దర్శకుడు బీవీఎస్‌ రవి బర్త్ డే విషెస్‌ చెప్పగా, `నో థ్యాంక్యూ` అంటూ పోస్ట్ పెట్టాడు. రైటర్‌ సిరాశ్రీ సైతం తనదైన స్టయిల్‌లో విషెస్‌ చెప్పగా, మధ్యలోనే చదవడం ఆపేశా` అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ లు వైరల్‌ గా మారాయి. 

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…

నాగార్జునతో `శివ` సినిమా చేసి టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన రామ్‌గోపాల్‌ వర్మ అప్పట్లో ఓ ట్రెండ్‌ సెట్టర్‌ దర్శకుడిగా నిలిచారు. ఆ తర్వాత `రంగీలా`, `క్షణక్షణం`, `మనీ`, `గులాబీ`, `దెయ్యం`, `సత్య`, `సర్కార్‌` వంటి సంచలనాత్మక చిత్రాలను రూపొందించారు. `ఐస్‌క్రీమ్‌` వంటి లో బడ్జెట్‌ చిత్రాలు చేశారు. ఇటీవల వివాదాస్పద అంశాలను తీసుకుని సినిమాలు తీస్తూ దర్శకుడిగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు.