Asianet News TeluguAsianet News Telugu

'రజినీకాంత్ రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిది': సీనియర్ పొలిటీషియన్

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడంపై కొన్నేళ్లుగా సప్సెన్స్ కొనసాగుతోంది. ఆయన పాలిటిక్స్ లోకి వస్తారని సన్నిహితులు చెబుతుంటే రజినీకాంత్ మాత్రం మౌనం వహిస్తూనే ఉన్నారు. అభిమానులతో చర్చలు జరుపుతున్నప్పటికీ కరెక్ట్ గా తన అడుగు ఎటువైపు అనేది చెప్పడం లేదు. 

tncc leader comments on rajini kanth political career
Author
Hyderabad, First Published Jul 16, 2019, 8:01 AM IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడంపై కొన్నేళ్లుగా సప్సెన్స్ కొనసాగుతోంది. ఆయన పాలిటిక్స్ లోకి వస్తారని సన్నిహితులు చెబుతుంటే రజినీకాంత్ మాత్రం మౌనం వహిస్తూనే ఉన్నారు. అభిమానులతో చర్చలు జరుపుతున్నప్పటికీ కరెక్ట్ గా తన అడుగు ఎటువైపు అనేది చెప్పడం లేదు. 

అయితే రీసెంట్ గా కోలీవుడ్ మీడియాలో మళ్ళీ రజినీ పొలిటికల్ కెరీర్ పై రూమర్స్ వచ్చాయి. దీంతో పలువురు నేతలు ఊహించని విధంగా కామెంట్ చేస్తున్నారు. రీసెంట్ గా టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి కూడా రజినీకాంత్ గురించి మాట్లాడారు. ఆయన రాజకీయాల్లోకి రాకుంటేనే మంచిదని వివరణ ఇచ్చారు. 

ఎంజీఆర్ లాంటి స్టార్ హీరో తరువాత ఎవరు కూడా పాలిటిక్స్ లో క్లిక్కవ్వలేదని చెబుతూ.. రాజకీయాలు సినిమాలు ఒక్కటి కాదని అన్నారు. వేలూరు లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ఏసీ షణ్ముగానికి రజనీ మక్కల్‌ మండ్రం సభ్యులు మద్దతుగా నిలవడంతో విలేకరుల సందేహాలకు అళగిరి ఈ విధంగా స్పందించారు.

వేలూరులో సినిమా థియేటర్లు ఎక్కువ ఉన్నాయని కావాలంటే సినిమాలను రిలీజ్ చేసుకొని సక్సెస్ అవ్వవచ్చు. అంతే గాని రాజకీయాల్లో సినీ తారలు ఈ రోజుల్లో గెలవలేరని చెప్పారు. ఇంతటితో రజినీ రాజకీయాలను దూరం పెడితే బెటర్ అని అళగిరి వివరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios