మెగా యంగ్ హీరో సాయి ధర్మ తేజ్  ఆ మధ్యన వరస ఫ్లాఫ్ లతో వెనకబడిపోయాడు కానీ ఇప్పుడు కాస్త పుంజుకున్నాడు. ఇక హిట్ రాదేమో అనుకున్న టైమ్ లో  ఎలాంటి హైప్ లేకుండా హడావిడి ఆర్భాటం లేకుండా వచ్చిన 'చిత్రలహరి' వర్కవుట్ అయ్యింది. ఈ సినిమా భారీగా కలెక్షన్స్ తేలేకపోయినా, సాయి తేజ కెరీర్ కు ఊపిరి పోసింది. రిలీజ్ రోజు నుంచి  మంచి టాక్ సంపాదించుకొని  అతనిపై ట్రేడ్ లో మళ్ళీ ఆశలు చిగురించేలా చేసింది.

అయితే ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో తేజు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆచి తూచి సినిమాలను చేయాలని ఫిక్స్ అయ్యాడు . అలాగే తన సినిమా టైటిల్స్ విషయంలో కూడా అదే తరహా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

అందులో భాగంగానే మారుతీ దర్శకత్వం లో  తెరకెక్కుతున్న సినిమాకు 'ప్రతిరోజు పండగే' అనే ఇంట్రస్టింగ్ టైటల్ పెట్టారు. దాంతో  ఫ్యామిలీ ఆడియన్స్  సినిమా రిలీజ్ కాకముందే చూడాలని ఫిక్స్ అయ్యిపోయారు. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమాను కూడా పట్టాలెక్కిస్తున్నాడు తేజు . ఆ సినిమాకు 'సోలో బ్రతుకే సో బెటరు' అనే క్యాచీ టైటిల్ అను పరిశీలిస్తున్నట్లు సమాచారం.  

ఈ సినిమాను కొత్త దర్శకుడు సుబ్బు డైరెక్ట్ చేయనున్నాడు.  ఈ టైటి ల్ ను ‘మనీ’ చిత్రంలోని ‘భద్రం బీకేర్ ఫుల్ బ్రదరు’ అనే పాట నుంచి తీసుకున్నారు. టైటిల్ చూస్తూంటే సినిమా లవ్ కమ్ కామెడీ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది. అక్టోబర్ నుండి సెట్స్ మీదికి వెళ్ళనున్న ఈ సినిమాలో నభ నటేష్ హీరోయిన్ గా నటించనుంది. సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.