చిరు,డైరక్టర్ బాబి చిత్రం టైటిల్ లాక్, ఇదేనా?
చిరంజీవి 153 వ చిత్రంగా ‘లూసీఫర్’ రీమేక్ చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత మెహర్ రమేష్ డైరెక్షన్లో చెయ్యాల్సిన ‘వేదాలం’ రీమేక్ ని చేస్తారు. ఈ రెండు కాకుండా బాబితో ఓ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఆ చిత్రం కథ ఓకే అయ్యి...స్క్రిప్టు వర్క్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. చిరంజీవి కొద్దిపాటి మార్పులు చెప్తే చేస్తున్నారట.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ ,‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ల పై నిరంజన్ రెడ్డి, రాంచరణ్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది చిరు కి 152 వ చిత్రం అన్న సంగతి తెలిసిందే. ఇక 153 వ చిత్రంగా ‘లూసీఫర్’ రీమేక్ చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత మెహర్ రమేష్ డైరెక్షన్లో చెయ్యాల్సిన ‘వేదాలం’ రీమేక్ ని చేస్తారు. ఈ రెండు కాకుండా బాబితో ఓ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఆ చిత్రం కథ ఓకే అయ్యి...స్క్రిప్టు వర్క్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. చిరంజీవి కొద్దిపాటి మార్పులు చెప్తే చేస్తున్నారట.
ఇక ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోందని సమాచారం. అంతేకాదు ఈ సినిమాకు ఓ టైటిల్ ని కూడా ఫిక్స్ చేసారట. మీడియావర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆ టైటిల్ వీరయ్య. యాక్షన్ ఎంటర్టైనర్ గా చిత్రం సాగుతుందని, చాలా కాలం తర్వాత చిరంజీవి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చేయబోయే సినిమా అవుతుందని, ఫన్ కూడా అదే స్దాయిలో వర్కవుట్ చేసారని వినికిడి. వెంకీమామ తర్వాత బాబి డైరక్షన్ లో రూపొందనున్న చిత్రం ఇదే. అనీల్ సుంకర..తమ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా రుపొందించబోతున్నట్లు తెలుస్తోంది.
ఎలాంటి గ్యాప్ లేకుండా వరస ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తున్నారు చిరంజీవి. ఈ క్రమంలో నే `ఆచార్య` పూర్తవ్వకుండానే లూసీఫర్ రీమేక్‌కి ఓకే చెప్పేశాడు. ప్రస్తుతం మోహన్ రాజా ఆధ్వర్యంలో స్క్రిప్టు పనులు చక చక సాగుతున్నాయి. ఇప్పుడు బాబీ కథకూ ఓకే చెప్పేసారు. ఈ ప్రాజెక్టు దాదాపుగా ఓకే అయిపోయినట్టే. అతి త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రానుంది. మరో ప్రక్క `వేదాళం` రీమేక్ ని మెహర్ రమేష్ తో పట్టాలెక్కించాల్సివుంది. కథ కూడా రెడీ అయిపోయింది. లూసీఫర్ కంటే ముందు బాబీ సినిమా కంటే ముందు.. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కాలి. అయితే బాబీ, మెహర్ రెండు సినిమాల్నీ ఒకేసారి పట్టాలెక్కించాలని భావిస్తున్నాడట. ఈ సినిమాల షూటింగులు సమాంతరంగా జరిపి.. రెండు నెలల గ్యాప్ లో రెండు సినిమాల్నీ విడుదల చేయాలని చూస్తున్నాడని వినికిడి.