ప్రభాస్‌ కొత్త సినిమాకు సంబంధించిన అప్‌డేట్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. సాహో సినిమా సెట్స్‌ మీద ఉండగానే ప్రభాస్‌ తన తదుపరి చిత్రాన్ని ఎనౌన్స్ చేశాడు. జిల్‌ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడిక్‌ రొమాంంటిక్‌ డ్రామాలో నటిస్తున్నట్టుగా తెలిపాడు ప్రభాస్‌. అంతేకాదు ఆ సినిమా షూటింగ్‌ కార్యక్రామలు కూడా ప్రారంభించాడు. ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ తో కలిసి ప్రభాస్‌ పెదనాన కృష్ణంరాజు గోపీ కృష్ణ మూవీస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు.

ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్‌కు కరోనా కారణంగా బ్రేక్‌ పడింది. ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరించాల్సి ఉండటంతో షూటింగ్ ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సినిమా ప్రారంభమయ్యి చాలా కాలం అవుతున్న ఇంత వరకు సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు చిత్రయూనిట్. గతంలో ప్రభాస్‌ స్టిల్ ఒకటి రిలీజ్ చేసినా టైటిల్‌ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. దీంతో అఫీషియల్ అప్‌డేట్‌ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నా ఫ్యాన్స్‌.

తాజాగా ఈ విషయంలో అభిమానులకు ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది ప్రభాస్‌ 20 టీం. 10 తేదిన సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ పోస్ట్‌ను రిలీజ్‌  చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పీరియాడిక్‌, రొమాంటిక్‌ ఫ్లేవర్‌ కనిపించేలా వాచ్‌, ఫ్లవర్స్‌తో ఇంట్రస్టింగ్‌గా ఈ పోస్టర్‌ను డిజైన్‌  చేశారు. పదో తారీఖున ఉదయం 10 గంటలకు ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ రిలీజ్ అవుతుందని వెల్లడించారు చిత్రయూనిట్‌.