Asianet News TeluguAsianet News Telugu

Indian 2 : ‘ఇండియన్2’ అప్డేట్ కి టైమ్ ఫిక్స్.. ‘ఇంట్రో’ రిలీజ్ కి ఓ రేంజ్ ప్లాన్.. ఏం చేస్తున్నారంటే?

లోకనాయకుడు కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ నుంచి ఈరోజే ఇంట్రో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ పక్కా టైమ్ ఫిక్స్ చేశారు. అలాగే అన్ని భాషల్లో సూపర్ స్టార్స్ తో ఈ పరిచయ వీడియోను విడుదల చేయబోతున్నారు. ఏఏ భాషలో ఎవరెవరంటే..
 

Time Fix for Indian 2 intro Video Release NSK
Author
First Published Nov 3, 2023, 1:33 PM IST | Last Updated Nov 3, 2023, 1:43 PM IST

లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) -  క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ (Shankar)  కాంబినేషన్ లో Indian 2 రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. 1996లో ‘భారతీయుడు’తో ఈ కాంబో సెన్సేషన్ క్రియేట్ చేయగా.. ఇన్నాళ్లకు సీక్వెల్ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ పార్ట్ ముగిసింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రమోషన్స్ ను కూడా ప్రారంభించారు. తొలుత ‘ఇండియన్ 2 ఇంట్రో’ వీడియోను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. 

ఇప్పటికే ‘ఇంట్రో’ రాబోతుందని చెప్పిన  యూనిట్ తాజాగా ఈరోజు సాయంత్రం 5 :30 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అలాగే ఒక్కో భాషలో అక్కడి సూపర్ స్టార్స్ తో An Introను విడుదల చేసేందుకు ఏర్పాటు చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా ‘ఇండియన్ 2’ ప్రచారం గట్టిగా జరగనుంది. అలాగే ఎవరెవరు ఏ భాషలో ఈ అప్డేట్ ను విడుదల చేయబోతున్నారనే వివరాలనూ వెల్లడించారు. 

తమిళంలో.. సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఇంట్రోను విడుదల చేయబోతున్నారు. కమల్ హాసన్ - సూపర్ స్టార్ మధ్య ఉన్న బంధం దీంతో మరింత పెరుగుతుందని యూనిట్ ఆశించింది. తెలుగులో.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli)  లాంచ్ చేయబోతుండటం విశేషంగా మారింది. ప్రముఖ దర్శకుడు తెలుగు వెర్షన్ ఇంట్రోను విడుదల చేయబోతుండటాన్ని యూనిట్ గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపింది.  

హిందీలో.. స్టార్ హీరో, మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ (Aamir Khan)  అఫీషియల్ గా లాంచ్ చేస్తున్నారు. ఇక కన్నడలో... సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) ఇంట్రోను విడుదల చేస్తున్నారు. ఓకే సమయానికి అన్నీ భాషల్లోని సూపర్ స్టార్స్ ఈ అప్డేట్ ను విడుదల చేయబోతుండటం విశేషం మారింది. దీంతో ‘ఇండియన్ 2’పై ఉన్న అంచనాలు ఆకాశానికి చేరుకోనున్నాయి. తొలి అప్డేట్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు శంకర్ మాస్టర్ ప్లాన్ సినిమాకు మరింత హైప్ ను తీసుకురాబోతోంది. 

Time Fix for Indian 2 intro Video Release NSK

 

ఇక టైమ్ ఫిక్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా మారింది.  పోస్టర్ లో సేనాపతి వాడే కత్తిని చూపించారు. రెండో పార్టులో కూడా దాన్నే ఆయుధంగా వాడబోతున్నారని అర్థమవుతోంది. మొత్తానికి ‘ఇంట్రో’పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, రెడ్ గెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లు. బాబీ సింహా, ప్రియా భవాని శంకర్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. 

Time Fix for Indian 2 intro Video Release NSK

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios