సారాంశం
సిద్దు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ కలిసి నటిస్తున్న `టిల్లు స్వ్కైర్` మూవీ నుంచి సెకండ్ సాంగ్ రాబోతుంది. తాజాగా సాంగ్ ప్రోమో విడుదలైంది. ఇంట్రెస్టింగ్‌గా సాగింది.
`డీజే టిల్లు` టాలీవుడ్ లో చిన్న చిత్రాల్లో ఒక సంచలనం. ఈ మూవీ భారీ హిట్ అందుకుంది. ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. దీంతో ఆ మూవీకి సీక్వెల్‌గా `టిల్లు స్వ్కైర్` మూవీ రూపొందుతుంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తుండగా, ఇందులో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేస్తుంది. మలిక్ రామ్ దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ మూవీ రూపొందుతుంది.
ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. ఫిబ్రవరిలో రాబోతుంది. అయితే ఈ మూవీ నుంచి ఇప్పటికే ఓ సాంగ్‌ని విడుదల చేయగా, అది దుమ్మురేపింది. ఇప్పుడు మరో సాంగ్‌ని విడుదల చేయబోతున్నారు. `రాధిక` పేరుతో సాగే పాటని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తాజాగా సాంగ్ ప్రోమోని విడుదల చేశారు. `రింగుల జుట్టు చూసి పడిపోయానే.. నీ బొంగుల మాటలిని పడిపోయానే` అంటూ అనుపమా పరమేశ్వరన్‌ని ఉద్దేశించి హీరో సిద్దు పాడే పాట ఇది.
అనుపమా రింగులపై ఈ పాట సాగడం ఓ విశేషమైతే. ఇందులోనూ హీరోయిన్ పేరు రాధికగానే ఉండబోతుందని తెలుస్తుంది. మొదటి భాగంలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటించగా, ఆమె పేరు రాధికా. ఆ పేరు పెద్ద బ్రాండ్‌గానూ మారిపోయింది. దాన్ని ఇందులోనూ కంటిన్యూ చేస్తున్నారని తెలుస్తుంది. తాజాగా పాట ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ నెల 27న సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. దీంతో సినిమాపై ఆసక్తి ఏర్పడుతుంది.