Asianet News TeluguAsianet News Telugu

Tillu Square Glimpse: టిల్లుగాడి రాధిక జ్ఞాపకాలు తవ్విన అనుపమా పరమేశ్వరన్‌..

`డీజే టిల్లు`లో టిల్లు, రాధిక మధ్య లవ్‌ ఎపిసోడ్‌ నెలకొంది. అది బ్రేకప్‌ వరకు వెళ్లింది. తాజాగా దాన్ని తవ్వింది అనుపమా పరమేశ్వరన్‌. ఇది కొత్త రచ్చకి దారితీస్తుంది. 

tillu square glimpse out radhika episode revealed by siddu to anupama parameswaran arj
Author
First Published Feb 7, 2024, 7:27 PM IST | Last Updated Feb 7, 2024, 7:27 PM IST

`డీజే టిల్లు`తో స్టార్‌ అయిపోయాడు సిద్దు జొన్నలగడ్డ. సినిమా పేరునే తన పేరుగా చేసుకున్నారు. స్టార్ బాయ్ ట్యాగ్‌తో ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్‌ చేస్తున్నాడు. `టిల్లు స్వ్కైర్‌` పేరుతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. మొదటి సినిమాకి దర్శకత్వం వహించిన మల్లిక్ రామ్ దీన్ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. హీరో సిద్దు జొన్నలగడ్డ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా `టిల్లు స్వ్కైర్‌` నుంచి బర్త్ డే గ్లింప్స్ విడుదల చేశారు. 

ఇందులో సిద్దు తన లవర్‌ అనుపమా పరమేశ్వరన్‌ని తీసుకుని కారులో వెళ్తుంటారు. అది ఆయన బర్త్ డే. కారులో వెనకాల ఫ్రెండ్‌ తన పుట్టిన రోజు అని తెలిసి విష్‌ చేస్తాడు. దీంతో సారీ చెబుతూ అనుపమా కూడా బర్త్ డే విషెస్‌ చెబుతుంది. అయితే ఆమె ముద్దుతో విష్‌ చేయడం విశేషం. అనంతరం గత బర్త్ డే రోజు ఏం చేశాడు టిల్లు అని అడుగుతుంది అనుపమా. దీంతో `డీజే టిల్లు`లోని స్టోరీని బయటపెడతాడు. నల్లమల ఫారెస్ట్ డైరెక్టెడ్‌ బై రాధికా, చాలా బాగా కథ చెబుతుందని వెల్లడించారు. హర్రర్‌, సాడ్‌, థ్రిల్లర్‌, మిస్టరీ, క్రైమ్‌ ఇలా అన్ని మిక్స్ అయి ఉంటాయని, ఓటీటీలో ఆ సినిమా చూసినట్టు చెప్పాడు. ఓవరాల్‌గా కామెడీ అన్నాడు. అది పాత జ్ఞాపకాలే గానీ తీపి జ్ఞాపకాలు కాదని చెప్పడం విశేషం. 

ఆద్యంతం ఆకట్టుకునేలా ఈ గ్లింప్స్ సాగింది. మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇందులో లిల్లీ పాత్రలో అనుపమా పరమేశ్వరన్‌ నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే "టికెట్టే కొనకుండా", "రాధిక" పాటలను విడుదల చేయగా.. రెండు పాటలూ విశేషంగా ఆకట్టుకొని, చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. తాజాగా గ్లింప్స్ అంతే ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. మొదటి భాగంలోని రాధికతో జరిగిన విషయాల గురించి టిల్లు పూర్తిగా చెప్పకుండా తనదైన హాస్య పద్ధతిలో సింపుల్ గా ముగించాడు. టిల్లు, లిల్లి మధ్య సంభాషణ ఎంతో వినోదభరితంగా సాగింది. 

ఈ గ్లింప్స్‌ లో అనుపమ పరమేశ్వరన్ గతంలో కంటే చాలా అందంగా, మరింత గ్లామరస్‌గా కనిపిస్తుంది. మొత్తానికి ఈ గ్లింప్స్‌ మునుపటి చిత్రం 'డీజే టిల్లు'లో జరిగిన విషయాలను గుర్తు చేయడమే కాకుండా, 'టిల్లు స్క్వేర్' ఎలా ఉండబోతుందనే ఆసక్తిని కూడా కలిగిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నారు. దీనికి థమన్‌ నేపథ్యం సంగీతం అందిస్తున్నారు.  రామ్ మిరియాల, అచ్చు రాజమణి సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.  ఈ చిత్రం 2024, మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. మొదటి భాగంలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఇందులో అనుపమా హీరోయిన్‌గా చేస్తుంది.

Read more: `లాల్‌ సలామ్‌` తెలుగు ట్రైలర్‌.. ముంబయిలో మెయిదీన్‌ భాయ్‌ లెక్క వేరే లెవల్‌..

Also read: `కల్కి`లో మృణాల్‌ ఠాకూర్‌..? రిలీజ్‌ డేట్‌పై కొత్త వార్త..
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios