Asianet News TeluguAsianet News Telugu

`కల్కి`లో మృణాల్‌ ఠాకూర్‌.. ఏ పాత్రలో అంటే..? రిలీజ్‌ పై కొత్త రూమర్‌..

ప్రభాస్‌ నటిస్తున్న `కల్కి` సినిమాకి సంబంధించి రోజుకో వార్త వినిపిస్తుంది. అంచనాలను పెంచేస్తుంది. తాజాగా ఇందులో మరో స్టార్‌ హీరోయిన్‌ భాగం కాబోతుందని తెలుస్తుంది. 

mrunal thakur in kalki movie new update on release date ? arj
Author
First Published Feb 7, 2024, 4:34 PM IST | Last Updated Feb 7, 2024, 8:05 PM IST

ప్రభాస్‌ `సలార్‌` తర్వాత మరో బిగ్గెస్ట్ మూవీతో రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న `కల్కి 2898 ఏడీ` చిత్రం విడుదల కాబోతుంది. ఈ సమ్మర్‌ స్పెషల్‌గా ఈ మూవీ విడుదల కాబోతుంది. ఐకానిక్‌ డేట్‌ మే 9న రాబోతుంది. ఈ డేట్‌న వచ్చిన చాలా సినిమాలు సంచలనాలు సృష్టించాయి. చిరంజీవి `జగదేక వీరుడు అతిలోక సుందరి`, ఇటీవల `మహానటి` చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు అదే రోజున `కల్కి` సినిమాని విడుదల చేయబోతున్నారు. 

ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ మారుతుందనే ప్రచారం జరిగింది. ఇంకా షూటింగ్‌ జరుగుతుందని, ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదని, వీఎఫ్‌ఎక్స్ వర్క్ కూడా ఇంకా కంప్లీట్‌ కావాల్సి ఉందని, అందుకే వాయిదా పడుతుందనే వార్త వినిపిస్తుంది. ఆగస్ట్ 15న వచ్చే అవకాశం ఉందంటూ టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. కానీ ఈ మూవీ వాయిదా పడటం లేదట. ప్రస్తుతం షూటింగ్‌ చేస్తున్నది రెండో పార్ట్ కోసమని అంటున్నారు. మొదటి పార్ట్ వర్క్ ఆల్‌రెడీ అయిపోయిందట. ఇప్పుడు రెండో పార్ట్ కోసమే చిత్రీకరణ జరుగుతుందని, ఇందులో భారీ కాస్టింగ్‌ పాల్గొంటున్నారని అంటున్నారు. 

ప్రభాస్‌, కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ, రానా, అలాగే గెస్ట్ రోల్స్ చేస్తున్న విజయ్ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ వంటి వారు కూడా ఇందులో నటిస్తున్నారని అంటున్నారు. క్లైమాక్స్ లో ఈ ఎపిసోడ్‌ ఉంటుందని తెలుస్తుంది. కానీ సినిమా వాయిదా పడే ఛాన్స్ లేదని తెలుస్తుంది. దీనిపై టీమ్‌ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే ఇందులో మరో నటి మెరబోతుందట. `సీతారామం` బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె గెస్ట్ రోల్‌ చేస్తుందట. ఇప్పటికే వీరి బ్యానర్‌లో `సీతారామం` చేసింది మృణాల్‌. దీంతో ఆమెని `కల్కి`లో గెస్ట్ గా తీసుకుంటున్నారట. ఇందులో ఆమె రాధ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఇందులో భారీగా ఆర్టిస్టులు గెస్ట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఇది సినిమాపై హైప్‌ని అమాంతం పెంచేస్తుంది. 

సైన్స్ ఫిక్షన్‌ కథతో దీన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. మన ఇండియన్‌ పురాణాలతో ఈ కథకి సంబంధం ఉంటుందని, ఇందులో ప్రభాస్‌ రెండు మూడు గెటప్‌లో కనిపిస్తారని, రాముడు, కృష్ణుడు, కల్కిలా కనిపిస్తాడని సమాచారం. ఇక వైజయంతి మూవీస్‌ పతాకంపై ఈ మూవీ రూపొందుతుంది. ఈ మూవీని మూడు పార్ట్ లుగా తీసుకురాబోతున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ ఫైనల్‌ షెడ్యూల్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఇది పార్ట్ 2కి సంబంధించిన సీన్లు అని తెలుస్తుంది. క్లైమాక్స్ లో ఈ పాత్రలన్నీ ఎంట్రీ ఇస్తాయని, పార్ట్ 2కి లీడ్‌ ఇచ్చేలా ఉంటాయని తెలిపారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios