Asianet News TeluguAsianet News Telugu

‘టిల్లు స్వ్కేర్’ ఫస్ట్ సింగిల్ రెడీ.. అదిరిన 'టిక్కెట్ ఏ కొనకుండా' ప్రోమో.. సూపర్ డైలాగ్ కూడా..

స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ - అనుపమా పరమేశ్వరన్ జంటగా ‘టిల్లు స్క్వేర్’ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయా అప్డేట్స్ అందాయి. తాజాగా ఫస్ట్ సింగిల్ ప్రోమోను వదిలారు. 
 

Tillu Square Fist SIngle Ticket Eh Konakunda Song Promo Out NSK
Author
First Published Jul 24, 2023, 7:26 PM IST

గతేడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రొమాంటిక్ అండ్ కామెడీ ఫిల్మ్ ‘డీజే టిల్లు’ యూత్ ను ఎంత ఆకట్టుకుందో తెలిసిందే. ఈ చిత్రంలోని సాంగ్స్ , డైలాగ్స్  ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. Dj Tilluలో సిద్ధు జొన్నలగడ్డ పెర్ఫామెన్స్ అదిరిపోయిన విషయం తెలిసిందే. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ‘టిల్లు స్క్వేర్’ షూట్ కూడా ప్రారంభించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తుదిదశకు చేరుకుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి వరుస అప్డేట్స్  ఇచ్చేందుకు యూనిట్ సిద్దమైంది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీస్ లతో సిద్ధూ గొడవపడే వీడియోను రిలీజ్ చేసి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. క్రేజీ అటిట్యూడ్ తో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చిన పోస్టర్లు కూడా సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.ఇక తాజాగా First Single ను రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. 

రేపు సాయంత్రం ‘టిల్లు స్క్వేర్’ నుంచి ఫస్ట్ సాంగ్ రానుందని తెలిపారు. ‘టిక్కెట్ హే కొనకుండా’ అనే టైటిల్ తో అదిరిపోయే సాంగ్ విడుదల కాబోతుందని చెప్పారు. ఈ సాంగ్ కు సంబంధించి ప్రోమోను విడుదల చేశారు. ప్రోమోలో సాంగ్ మొదలవ్వడానికి ముందు సిద్ధూ.. అనుపమా మధ్య క్రేజీ కన్వర్జేషన్ ను చూపించారు. ఆ తర్వాత అదిరిపోయే బీట్ స్టార్ట్ అవుతుంది. అంతటితో ప్రొమో ముగుస్తుంది. దీంతో సాంగ్ పై అంచనాలు పెరిగాయి. రామ్ మిరియాల మ్యూజిక్ అందిస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. తాజాగా ప్రోమోలో సిద్ధూ చెప్పిన డైలాగ్ ఆసక్తికరంగా మారింది. అనుపమాతో మాట్లాడుతూ.. ‘మనస్సు విరిగినట్టు ఉన్నది ఎక్కడో.. ఉన్నడా బాయ్ ఫ్రెండ్.. ఉంటే నా షూ నేనేసుకోని వెళ్తా లేదంటే.. నిన్ను ఏసుకొని వెళ్తా’ అంటూ చెప్పిన క్రేజీ డైలాగ్ ను యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. డైలాగ్ ను బట్టి చూస్తే సినిమాలో రొమాన్స్ డోస్ మరింతగా ఉండనుందని తెలుస్తోంది. ఇక రేపు ఫుల్ సాంగ్ రానుంది. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై  నాగవంశీ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios