Asianet News TeluguAsianet News Telugu

`టిల్లు స్వ్కేర్‌` వంద కోట్ల సినిమా.. నాగవంశీ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. థియేటర్ల ఆక్యుపెన్సీ ఎలా ఉందంటే?

సిద్దు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటించిన `టిల్లు స్వ్కేర్‌` మూవీ శుక్రవారం విడుదలై పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో నిర్మాత బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు.

tillu square become a 100 crore movie producer bold statement theater occupancy domination arj
Author
First Published Mar 29, 2024, 8:27 PM IST

సిద్దు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటించిన `టిల్లు స్వ్కేర్‌` మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఆడియెన్స్ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కించుకుంటుంది. `డీజే టిల్లు` సినిమా పెద్ద హిట్‌ కావడంతో, దానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. తాజాగా శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఆ అంచనాలను అందుకోవడంలో సక్సెస్‌ అయ్యిందనే చెప్పాలి. చాలా వరకు మొదటి పార్ట్ ని మించి ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

సినిమాకి వస్తోన్న స్పందనపై టీమ్ సంతోషం వ్యక్తం చేసింది. శుక్రవారం టీమ్‌ కేక్‌ కట్‌ చేసి, బాణా సంచా పేల్చి సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. సినిమా వంద కోట్లు కలెక్ట్ చేస్తుందన్నారు. భారీ ఓపెనింగ్స్ ఆశిస్తున్నామని, నైజాం, ఓవర్సీస్‌లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని, ఫస్ట్ డే 25కోట్ల గ్రాస్‌ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నామని తెలిపారు. సినిమాకి వరుస సెలవులు కలిసి వస్తున్నాయని, ఈ చిత్రం లాంగ్‌ రన్‌లో వంద కోట్లు వసూలు చేస్తుందని వెల్లడించారు నాగవంశీ. 

ఇక సినిమాలో బోల్డ్ సీన్ల గురించి చెబుతూ, బోల్డ్ సీన్లు ఏమున్నాయని ప్రశ్నించారు. లిప్‌లాక్లు బోల్డ్ సీన్లు కావని, అందరు వాటిని చూస్తున్నారు, ఎంజాయ్‌ చేస్తున్నారని, కామెడీ, ఫన్‌లో అవన్నీ లైట్‌ అని వాటిని ఆడియెన్స్ పట్టించుకోవడం లేదన్నారు. కథ గురించి కూడా ఎవరూ ఆలోచించడం లేదని, కథ సినిమాలో అండర్‌లైన్‌గా సాగుతుందని, కానీ టిల్లు, లిల్లీ పాత్రల మ్యాజిక్‌తో, కామెడీతో ఆ కథ గురించి ఆలోచించడం లేదని, సినిమాని ఎంజాయ్‌ చేస్తున్నారని హీరో సిద్దు జొన్నలగడ్డ తెలిపారు. 

ఇక తన పాత్రపై ప్రారంభంలో చాలా ట్రోల్స్ వచ్చాయని, అవి చాలా బాధగా అనిపించాయని తెలిపిన అనుపమా పరమేశ్వరన్‌, కానీ ఇలాంటి పాత్ర చేయకపోతే వేస్ట్ అని, చాలా మిస్‌ అయ్యేదాన్ని అని వెల్లడించింది. `నేను మొదటిసారి ఇలాంటి పాత్ర పోషించాను. అయినప్పటికీ నేను పోషించిన లిల్లీ పాత్ర నాకు మొదటి నుంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకం నిజమై, ఇప్పుడు నా పాత్రకు వస్తున్న స్పందన చూసి సంతోషంగా ఉంది` అని తెలిపింది అనుపమా. ఇందులో దర్శకుడు మల్లిక్‌ రామ్‌, `మ్యాడ్‌` డైరెక్టర్‌ శంకర్‌, భీమ్స్ సిసిరోలియో,  ఆంథోని, ప్రణీత్‌ రెడ్డి వంటి వారు పాల్గొన్నారు.  

ఇదిలా ఉంటే సినిమా థియేటర్లలో రచ్చ చేస్తుంది. మార్నింగ్‌ షోతో పోల్చితే ఈవినింగ్‌ బాగా పెరిగింది. థియేటర్ల ఆక్యుపెన్సీ పరంగా `టిల్లు స్వ్కేర్‌` డామినేషన్‌ కనిపిస్తుంది. నైజాంలో టిల్లుగాడి హవా నడుస్తుంది. 214 షోస్‌కి గానూ 197 షోస్‌ ఫిల్‌ కావడం విశేషం. ఇది ఆ మూవీకి దక్కుతున్న ఆదరణకు నిదర్శనంగా చెప్పొచ్చు. హైదరాబాద్‌ బేస్డ్ స్టోరీ కావడం, తెలంగాణ ఆడియెన్స్ కి ఇది బాగా కనెక్ట్ కావడంతో నైజాంలో దీని ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. 

Read more: 'టిల్లు స్క్వేర్' మూవీ రివ్యూ
 

Follow Us:
Download App:
  • android
  • ios