హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో వాహనాలను ఢీకొట్టాడు టిక్‌టాక్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్. అతి వేగంతో రెండు కార్లు, రెండు బైకులను ఢీకొట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నటుడు షణ్ముఖ్‌ని అదుపులోకి తీసుకుని , కారును  సీజ్ చేశారు.

టిక్‌టాక్‌తో పాటు పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించిన షణ్ముఖ్ తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. షణ్ముఖ్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. అలాగే యూట్యూబ్‌లో 26 లక్షలు, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 10 లక్షల ఫాలోవర్స్‌ ఉన్నారు.

షణ్ముఖ్‌ తీసిన ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ షార్ట్‌ఫిలిమ్ ఎంత హిట్‌ అయిందో తెలిసిందే. ఓ పెద్ద సినిమా తీసిన రాని పేరును ఒక షార్ట్‌ఫిలిమ్‌తో సంపాదించాడు షణ్ముఖ్‌.