ఎవరి జీవితం ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. ఊహకు అందనిదే జీవితం అనడానికి టిక్ టాక్ దుర్గారావ్ ఒక బెస్ట్ ఎగ్జామ్పుల్.  టిక్ టాక్ ద్వారా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న దుర్గారావ్ ఏకంగా సినిమా ఆఫర్ పట్టేశాడు. రవితేజ హీరోగా దర్శకుడు గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్న క్రాక్ మూవీలో దుర్గరావ్ ఓ రోల్ చేస్తున్నాడు. క్రాక్ మూవీలో దుర్గారావు పాత్ర ఏమిటి? నిడివి ఏమిటో ఎవరికీ తెలియదు కానీ... ఏకంగా సినిమా ఆఫర్ పట్టేసి అందరికీ షాక్ ఇచ్చాడు. 

క్రాక్ మూవీలోని తన లుక్ ని దుర్గరావ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. బ్లాక్ కలర్ చొక్కా ధరించి ఉన్న దుర్గారావు పోలీస్ స్టేషన్ లో సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు. మరి క్రాక్ మూవీలో దుర్గారావ్ ఏమి నేరం చేసి స్టేషన్ కి వెళ్ళాడో, సంక్రాంతికి థియేటర్స్ లో తెలిసిపోనుంది. 

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దుర్గారావ్ వ్యవసాయ కూలి. భార్యతో కలిసి ఓ ఆసామి దగ్గర పనిచేస్తూ ఉంటాడు. పెద్దగా చదువు లేని దుర్గారావ్, తన ఇంటికి వచ్చిన బంధువుల పిల్లాడి ద్వారా టిక్ టాక్ గురించి తెలుసుకున్నాడు. అప్పటి నుండి టిక్ టిక్ వీడియోలు చేయడం మొదలుపెట్టాడు.  మిగతావారికి భిన్నంగా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో భార్యతో కలిసి డాన్స్ వీడియోలు చేసేవాడు. అదే ఆయనను చాలా ఫేమస్ చేసింది. జబర్ధస్త్ తో పాటు అనేక బుల్లితెర వేదికలపై దుర్గారావ్ మరియు ఆయన సతీమణి పాల్గొన్నారు.