బాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలతో మతిపోగొడుతున్నాడు. ఎడారిలో బ్యాక్ ఫ్లిప్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఈయన విన్యాసాలకు టాలీవుడ్ హీరోయిన్స్ సమంత, తమన్న ఫిదా అయ్యారు.
బాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) మార్షల్ ఆర్ట్స్ విన్యాసాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శిల్పితో ప్రత్యేకంగా చెక్కినట్టుగా సిక్స్ పాక్ బాడీని మెయిన్ టేన్ చేస్తుస్తూ.. బాలీవుడ్ అగ్రహీరోలకే ఝలక్ ఇస్తున్నాడు టైగర్ ష్రాఫ్. మార్షల్ ఆర్ట్స్, యాక్షన్స్ సీన్స్ ను పండించడంలో టైగర్స్ ష్రాఫ్ స్టైలే వేరే. ఈయన సినిమాల కోసం సౌత్ ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ట్రైగర్ ష్రాఫ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటారు. తన వ్యక్తిగత విషయాలతో పాటు.. తన అప్ కమింగ్ ఫిల్మ్స్ కు సంబంధించిన అప్డేట్స్ ను ఫ్యాన్స్ కు అందిస్తుంటాడు. తాజాగా టైగర్ పోస్ట్ చేసిన రీల్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన విన్యాసాలకు హీరోయిన్లు ఫిదా అవుతున్నారు.
ట్రైగర్ ష్రాఫ్ సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. స్పెషల్ మ్యూజిక్ వీడియో సాంగ్స్ కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఇటీవల టైగర్ ష్రాష్, మౌనీ రాయ్ (Mouni Roy) కలిసి నటించిన పంజాబి సింగిల్ మ్యూజిక్ వీడియో సాంగ్ రిలీజ్ అయ్యి.. మంచి రెస్సాన్స్ ను అందుకుంది. ఈ సంతోషంలో అభిమానుల కోసం ఇదే సాంగ్ కు రీల్ చేశాడు టైగర్ ష్రాఫ్.. రీల్ లో కంటిన్యూగా ఎడారిలో కార్ట్ వీల్ చేస్తూ మతిపోగొట్టాడు. ఒకవైపు తన సాంగ్ కు అభిమానుల నుంచి వచ్చిన ఆదరణకు ఎండకొడుతున్నా విన్యాసాలు చేస్తూ మరింతగా ఆకట్టుకున్నాడు. మరోవైపు తను ఎడారిలో చిరుతపులిలా రన్నింగ్ చేస్తూ కనిపించాడు. ఈ రీల్ ను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నాడు. ‘మీ ప్రేమ నాకు అనుభూతిని కలిగించింది’ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు.
ఈ వీడియోను చూసిన అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. గ్రేట్ టైగర్, మైండ్ బ్లోయింగ్ హార్ట్ వర్కింగ్ అంటూ ప్రశంసిస్తున్నారు. మరోవైపు టైగర్ ష్రాఫ్ స్టంట్లకు తెలుగు హీరోయిన్లు కూడా ఫిదా అయ్యారు. గ్లామర్ బ్యూటీ సమంత రుత్ ప్రభు (Samantha) కామెంట్ లో స్పందించారు. ‘గుడ్ లార్డ్’అంటూ కామెంట్ చేశారు. ఇక మిల్క్ బ్యూటీ తమన్నా రీల్ ను లైక్ చేసింది. ఇక అభిమానులు లైక్ లు, కామెంట్లతో టైగర్ ష్రాఫ్ ను అభినందిస్తున్నారు. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ ‘హీరోపంథి 2’, ‘గణపత్’ మూవీలో నటిస్తున్నాడు.
