ప్రజెంట్ జనరేషన్ హీరోల్లో యాక్షన్ హీరోలు అనగానే హృతిక్ రోషన్, ప్రభాస్, టైగర్ ష్రాఫ్, యష్ లాంటి హీరోలు గుర్తొస్తారు. ఈ హీరోలు నటించే యాక్షన్ చిత్రాలకు అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. హృతిక్ రోషన్ యాక్షన్ విన్యాసాలని ఇదివరకే క్రిష్ లాంటి చిత్రాల్లో చూశాం.  ఇక టైగర్ ష్రాఫ్ కూడా బాగి చిత్రంలో అదరగొట్టాడు . 

వీరిద్దరూ కలసి నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'వార్' సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్ కళ్ళు చెదిరే విధంగా ఉండబోతున్నాయట. వార్ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది. 

ఇండియన్ స్క్రీన్ పై తొలిసారి ఈ చిత్రంలో గ్యాట్లింగ్ గన్ ని ఉపయోగిస్తున్నారు. గ్యాట్లింగ్ గన్ ని అమెరికా లాంటి దేశంలో ఆర్మీలో ఉపయోగిస్తాయి. అలాంటిది తొలిసారి గ్యాట్లింగ్ గన్ ని ఓ చిత్రం కోసం ఉపయోగిస్తున్నారు. వార్ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ లో టైగర్ ష్రాఫ్ ఈ గన్ ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. 

గ్యాట్లింగ్ గన్ కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక నిమిషానికి 2 వేల బుల్లెట్స్ ని వదిలే సామర్థ్యం ఈ గన్ కి కలదు. ఎక్కువ బరువు ఉండకపోవడంతో సులభంగా దీనిని ఉపయోగించవచ్చు. మొత్తంగా గ్యాట్లింగ్ గన్ ని వార్ చిత్రంలో వెండితెరపై ప్రేక్షకులు తొలిసారి చూడబోతున్నారు. ఇద్దరు యాక్షన్ సూపర్ స్టార్స్ కలసి నటిస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపిస్తాం అని దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ అంటున్నారు.