`టైగర్ నాగేశ్వర్‌రావు` ట్రైలర్, ప్రీరిలీజ్ ఈవెంట్ డిటెయిల్స్.. `రాక్షస కావ్యం` వచ్చేది అప్పుడే!
రవితేజ హీరోగా నటిస్తున్న `టైగర్ నాగేశ్వరరావు` సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాల జోరు పెంచారు. మరోవైపు అభయ్ నవీన్ నటించిన `రాక్షస కావ్యం` చిత్ర రిలీజ్ డేట్ మారింది.

మాస్ మహారాజా రవితేజ హీరోగా `టైగర్ నాగేశ్వరరావు` చిత్రం రూపొందుతుంది. స్టూవర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వంశీ. నుపుర్ సనన్ కథానాయికగా నటిస్తుంది. రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది యూనిట్. ఈ సినిమా ట్రైలర్‌ని అక్టోబర్ 3న ముంబయిలో విడుదల చేయబోతున్నారట. అక్కడ ఈవెంట్‌లో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని అక్టోబర్ 15న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. ఇక సినిమాని అక్టోబర్ 20న రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవల `రావణాసుర` చిత్రంతో డిజప్పాయింట్ చేసిన రవితేజ.. ఇప్పుడు `టైగర్ నాగేశ్వరరావు`తో హిట్ కొట్టాలనే కసితో వస్తున్నాడు. మరి హిట్ పడుతుందా చూడాలి.
అక్టోబర్ 13న `రాక్షస కావ్యం`..
ఇటీవల `రామన్న యూత్` అంటూ మెప్పించాడు అభయ్ నవీన్. ఇప్పుడు `రాక్షస కావ్యం` చిత్రంలో కీలక పాత్రలో నటించాడు. శ్రీమాన్ కీర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల చేయాలనుకున్నారు. కానీ తాజాగా రిలీజ్ డేట్‌ని మార్చారు. వారం గ్యాప్‌తో ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. అక్టోబర్ 15న రిలీజ్ చేయనున్నారు. ఆ విషయాలను చిత్ర బృందం వెల్లడించింది.
ఈ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఉమేష్ చిక్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. రా అండ్ రస్టిక్ మూవీగా “రాక్షస కావ్యం” ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ తో పాటు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అమ్మ పాట, విలన్స్ ఆంథెమ్ పాటలు ఇన్ స్టంట్ హిట్ అయ్యాయి. ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు “రాక్షస కావ్యం” ఇవాళ్టి ట్రెండ్ కు కావాల్సిన సినిమా అంటూ అప్రిషియేట్ చేశారు. ఇందులో అభయ్ నవీన్ తో పాటు అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించారు.