మాస్ మహారాజా రవితేజ అప్ కమింగ్ ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వర రావు’. ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్లు వస్తున్నాయి. తాజాగా రవితేజ సరసన బాలీవుడ్ బ్యూటీ నటిస్తున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మేరకు హీరోయిన్ ను  పరిచయం చేస్తూ వెల్ కమ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ (Ravi Teja) వరుస సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తున్నారు.క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెడుతూ ఫ్యాన్స్ లో జోష్  పెంచుతున్నారు. అయితే ఇప్పటికే రవితేజ‘రావణసుర, ధమ్కీ’ చిత్రాల షూటింగ్ లో బిజీ ఉన్నారు. త్వరగా పూర్తి చేసేందుకు నిర్విరామంగా షూటింగ్ లలో పాల్గొంటున్నారు. ఇటీవల ‘ఖిలాడీ’ (Khiladi) చిత్రంతో మంచి సక్సెస్ ను అందుకున్నాడు రవితేజ. ఇక మరో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. తన అప్ కమింగ్ ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వర రావు’ (Tiger Nageswara Rao) ఈ ఉదయమే అప్డేట్ అందించగా.. తాజాగా మరో క్రేజీ అప్డేట్ అందించారు మేకర్స్.

ఈ భారీ స్కేల్ నుంచి క్రేజీ అప్డేట్ అందింది. ఏప్రిల్ 2న మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాలకు ఈ చిత్రం నుంచి ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్టు ఈ ఉదమే అనౌన్స్ చేశారు. అలాగే అదే రోజు సినిమాకు ముహూర్తం కూడా ఖరారు చేసినట్టుగా చెప్పారు. కాగా తాజాగా టైగర్ నాగేశ్వర రావు హీరోయిన్ ను ప్రకటించారు. బాలీవుడ్ బ్యూటీ  కృతి సనన్‌ (Kriti Sanon) చెల్లెలు నుపుర్ సనన్ (Nupur Sanon) రవితేజ సరసన నటించనుంది. ఈ చిత్రంతోనే నుపుర్ సనన్ తెలుగు ఆడియెన్స్ కు పరిచయం కానుంది. 

నుపుర్ సనన్ హిందీలోనూ తన తొలిసినిమాను తాజాగా పూర్తి చేసుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో నవాజుద్దీన్ సిద్దిక్ (Nawazuddin Siddiqui)తో కలిసి డెబ్యూ  ఫిల్మ్  ‘నూరానీ చెహ్రా’లో నటించింది. ఈ చిత్రంతోనే  సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇటు రవితేజ సినిమాతోనూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ‘టైగర్ నాగేశ్వర రావు’ పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో  అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కనుంది. టైగర్ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. 

 

Scroll to load tweet…