Salman Khan : సల్మాన్ ఖాన్ ఇదేం పాడుపని.. స్టేజ్ పైనే ఆ హీరోకి ముద్దుల వర్షం... షాక్ లో కత్రీనా కైఫ్..
సల్మాన్ ఖాన్ యమా రొమాంటిక్ అని అందరికి తెలిసిందే.. మరోసారి అది రుజువు చేశాడు బాలీవుడ్ కండల వీరుడు. స్టేజ్ పైనే ముద్దుల వర్షం కురిపించాడు.. అయితే అవి హీరోయిన్ కు కాదు.. ఓ హీరోకి.

సల్మాన్ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. బాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా పేరుంది సల్మాన్ కు. ఆయన ఖాతాలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. ఘాటు రొమాన్స్ చేస్తాడు అంటూ సల్మాన్ కు బాలీవుడ్ లో ఇమేజ్ కూడా ఉంది. అయితే ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడు..? ఏం చేస్తాడు అనేది ఎవరూ ఊహించలేదు. తాజాగా అలాంటి పనే చేశాడు సల్మాన్. టైగర్ 3 సక్సెస్ మీట్ లో.. పబ్లిక్ గా ముద్దుల వర్షం కురిపించాడు. అయితే అవి తన హీరోయిన్ కత్రీనాకు అనకున్నారో ఏమో.. కానే కాదు.. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ పై.
నిజంగా షాకింగ్ గా అనిపించినా ఇది నిజం. యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి స్పై మూవీస్ లో భాగంగా సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన సినిమా టైగర్ 3. ఈ సినిమా రీసెంట్ గా అంటే.. నవంబర్ 12న రిలీజ్ అయింది. సల్మాన్ టైగర్ 3 పై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. మనీష్ శర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది. ఒకప్పటి హీరో ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్ పాత్రలో అద్భుతం చేశారు.
ఇండియాలో ఆస్తులన్నీ అమ్ముకుంటున్న ప్రియాంక చోప్రా, కారణం ఏంటంటే..?
ఈక్రమంలో ఈసినిమా సంచలన విజయం సాధించడంతో పాటు..బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ కూడా సాధించింది. దాదాపు 400 కోట్లు కలెక్ట్ చేసినట్టు సమాచారం. సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మూవీ టీమ్ ముంబయ్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ముంబైలో అభిమానుల కోలాహలం మధ్య జరిగిన ఈ సక్సెస్ మీట్ లో.. టైగర్ 3 మూవీ టీమ్ అంతా సందడి చేసశారు. ఇక ఈ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో కత్రినా కైఫ్ తో నేను చేసిన రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ.. అతిష్ పాత్రలో లేకపోతే అతనికి కూడా ఇలానే జరిగేది అంటూ సడెన్ గా ఇమ్రాన్ వద్దకు వెళ్లి ఇమ్రాన్ మొహంపై ముద్దుల వర్షం కురిపించాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు.
సల్మాన్ అలా సడెన్ గా ఇమ్రాన్ ను ముద్దులు పెట్టుకోవడంతో.. అతను స్టన్ అయ్యాడు. అటు ఆడియన్స్ నుంచి అరుపులు, విజిల్స్ తో సందడి చేశారు. ఇమ్రాన్ కి ఇలా స్టేజిపై అందరి ముందు ముద్దు పెట్టిన సల్మాన్ ఆ తర్వాత.. నేను ఎక్కువగా ముద్దు సన్నివేశాల్లో నటించలేదు. కానీ ఇమ్రాన్ కి అది బాగా అలవాటు. ఈ సినిమాలో ఇమ్రాన్ అది మిస్ అయినందుకు నేను ఇలా అతని లోటు తీర్చాను అని కామెంట్స్ చేయసి.. అందరిని నవ్వించాడు. ఇమ్రాన్ హష్మీకి బాలీవుడ్ లో ముద్దుల హీరో అన్న పేరు ఉంది. కిస్ సీన్స్ స్పెషలిస్ట్ ఇమ్రాన్.. టైగర్ 3లో మాత్రం విలన్ గా నటించేవారకు ఒక్క ముద్దు సీన్ కూడా చేయలేకపోయాడు. దాంతో సల్మాన్ ఖాన్ ఇలా ఆటపట్టించాడు.