Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ : డిజాస్టర్ చిత్రం 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్'కు రెండు అవార్డులు !

బాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో అతిపెద్ద ఫ్లాఫ్ చిత్రం థగ్స్ ఆఫ్ హిందూస్థాన్. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతే భారీగా బోల్తా కొట్టింది. 

Thugs of Hindostan wins two FICCI-BAF awards
Author
Hyderabad, First Published Mar 16, 2019, 11:55 AM IST

బాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో అతిపెద్ద ఫ్లాఫ్ చిత్రం థగ్స్ ఆఫ్ హిందూస్థాన్. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతే భారీగా బోల్తా కొట్టింది. బాలీవుడ్ సూపర్‌స్టార్లు అమితాబ్ బచ్చన్, మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా సినిమాను కాపాడలేకపోవటం అందరికీ షాక్ ఇచ్చింది.   ఈ చిత్రాన్ని కొనుక్కున్నవాళ్లంతా వారంతా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు.  సినిమా చూసిన  ప్రేక్షకులు సైతం సినిమాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.  మెజారిటీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని మెచ్చలేదు.  ఈ పరాజయానికి పూర్తి భాద్యత తీసుకుంటున్నట్టు హీరో అమీర్ ఖాన్ తెలిపారు. 

తమ టీమ్ చేసిన ప్రయత్నం ప్రేక్షకులకు నచ్చలేదని, తమ ఆలోచన తప్పయిందని అన్నారు.  అంతేకాదు భారీ అంచనాలతో సినిమాకు వచ్చిన ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయలేకపోయినందుకు క్షమాపణల్ని తెలిపారు.  గత కొద్దిరోజులుగా ఫ్లాప్ సినిమా ఇచ్చాడని అసహనంగా ఉన్న ఆయన అభిమానులు ఇలా అమీర్ పరాజయానికి బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్పడంతో శాంతించారు.  అయితే ఇలాంటి సినిమాని రెండు అవార్డులు వరించి అందరినీ ఆశ్చర్యపరిచాయి.

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తాజాగా అవార్డుల్ని ప్రకటించింది.   విఎఫ్ఎక్స్ కేటగిరీలో బెస్ట్ ఇండియన్ సినిమా, బెస్ట్ షాట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల్ని ఈ సినిమా గెలుచుకుంది.  విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం బడ్జెట్లో ఎక్కువ మొత్తాన్ని ఖర్చు పెట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios