బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు వచ్చినా అమిర్ ఖాన్ సినిమా వస్తే ఆ హడావుడి మాములుగా ఉండదు. పీకే - దంగల్ సినిమాలతో అమిర్ ఖాన్ మీద అందరికి ఒక స్ట్రాంగ్ నిర్ణయం ఏర్పడింది. ఈ హీరో సినిమాల్లో తప్పకుండా మ్యాటర్ ఉంటుందని నార్త్ ప్రేక్షకులతో పాటు మిగతా సైడ్ ఆడియెన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. 

అయితే దంగల్ తో 2000 కోట్ల మార్కెట్ ఉన్న హీరోగా  చరిత్ర సృష్టించిన అమిర్ ఖాన్ ఈ సారి థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ తో అంతకంటే ఎక్కువ వసూళ్లు అందుకుంటాడని అంతా భావించారు. పైగా అమితాబ్ బచ్చన్ కూడా సినిమాలో ఉండడంతో అంచనాలు భారీగా పెరిగాయి. కానీ రిలీజ్ తరువాత సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. 

ఊహించని విధంగా డివైడ్ టాక్ రావడంతో రెండవరోజు నుంచి కలెక్షన్స్ డౌన్ అయ్యాయి. మొదటి రోజు 50కోట్లను అందుకోవడం తప్పితే తరువాత రోజు నుంచి తగ్గుతూ రావడం అందరిని షాక్ కి గురి చేశాయి. ఇక సోసమవరం కలెక్షన్స్ విషయానికి వస్తే అమిర్ ఖాన్ గత ఐదేళ్ళలో ఎప్పుడు అందుకొని విధంగా..  సినిమా రిలీజైన మొదటి అయిదు రోజుల అనంతరం అతి తక్కువగా 7 కోట్ల ను మాత్రమే రాబట్టగలిగాడు. 

దీంతో ఇప్పటివరకు థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ 130కోట్లను అందుకుంది. ఈ సినిమా అసలు బడ్జెట్ 200కోట్లు. నిర్మాత ఎక్కువగా నష్టపోలేదు గాని బయ్యర్స్ మాత్రం చాలా నష్టాలను చూసినట్లు చెప్పవచ్చు. ఇక రానున్న రోజుల్లో ఈ సినిమా ఫైనల్ గా ఏ నెంబర్ దగ్గర ఎండ్ అవుతుందో చూడాలి.