ఒక సినిమాను జనాల్లోకి చేరవేసే క్రమంలో ప్రచార చిత్రాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందులో ఇక అడల్ట్ కంటెంట్ ఉంటే మరింతగా జనాలకు రీచ్ అవుతుందని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు.

తాజాగా ఓ బోల్డ్ సినిమా ట్రైలర్ ని కూడా ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. అదే 'చీకటి గదిలో చితక్కొట్టుడు'. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. అదితి, నిక్కి తంబోలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను అడల్ట్ కంటెంట్ తో పాటు హారర్ మిక్స్ చేసి రూపొందించారు.

ట్రైలర్ లో బూతు కంటెంట్ ఓ రేంజ్ లో ఉండడంతో జనాలు తెగ చూస్తున్నారు. ఎంతగా అంటే రెండు రోజుల్లో ఈ చిన్న సినిమా ట్రైలర్ కి మూడు మిలియన్ల వ్యూస్ ని రాబట్టింది. బూతు కంటెంట్ ఎక్కువగా ఉందని కామెంట్స్ వేస్తున్నా.. ట్రైలర్ ని మాత్రం బాగానే చూస్తున్నారు. 

మొన్నామధ్య వచ్చిన 'ఏడు చేపల కథ' సినిమా ట్రైలర్ కూడా ఇలానే అడల్ట్ కంటెంట్ తో వ్యూస్ తెచ్చుకుంది. ఈ వ్యూస్ సినిమా ఓపెనింగ్స్ పై ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందేమో చూడాలి!