‘తొలిప్రేమ’ప్రతి వ్యక్తి జీవితంలో ఎప్పుడూ వెంటాడే ఓ అద్భుతమైన ఫీలింగ్. ఆ ప్రేమ జ్ఞాప‌కాలు మంచి వైనా చెడ్డవైనా గుర్తొచ్చిన ప్రతిసారి గమ్మత్తుగానే ఉంటుంది. ఈ గమ్మత్తును అద్భుత ప్రేమకావ్యంగా తెరకెక్కించారు దర్శకుడు వెంకీ అట్లూరి. వరుణ్ తేజ్, రాశిఖన్నా జోడిగా తెరకెక్కిన 'తొలిప్రేమ' యువతను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ‘తొలిప్రేమ’ మూవీలో డైలాగ్స్ ప్రేమికులను గిలిగింతలు పెడుతున్నాయి. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఆ పాపులర్ డైలాగ్స్‌ మీ కోసం.

1) 'జ్ఞాప‌కాలు చెడ్డవైనా మంచివైనా ఎప్పటికీ మనతోటే ఉంటాయి..మోయక తప్పదు'.

2) 'కలగా నా జీవితంలోకి వచ్చావ్.కలగంటున్నప్పుడు వెళ్లిపోయావ్..మళ్ళీ ఇలా మెరిశావ్.కలో నిజమో అర్ధం కావడంలేదు'

3) 'అమ్మాయిలకు ఇష్టం లేకుండా చేస్తే టీజింగ్..ఇష్టపడి చేస్తే ఫ్లర్టింగ్'.

4) 'మీకు ఐ లవ్ యూ చెప్పించుకోవడంలో కిక్ ఉంటే..మాకు తిప్పించుకోవడంలో కిక్కుంది'.

5) 'దేవుడికే క్యాస్ట్ లేనప్పుడు..ఆఫ్ట్రాల్ మనమెంత అంకుల్'.

6) 'మనుషులం అంకుల్ ప్రేమ గుర్తుండదు..తప్పు ఒకటే గుర్తుంటుంది'.

7) 'మనతో కొందరుప్రేమను నటిస్తారు..ఇంకొందరు కోపాన్ని నటిస్తారు..కానీ కోపాన్నిచూపేవారు ఎక్కువ ప్రేమిస్తారు'.

8) 'అప్పుడెప్పుడో నిన్ను వదిలేసి వచ్చాననుకున్నాను..కానీ ఇప్పటివరకు నిన్ను మోస్తూనే ఉన్నాను'.

9) 'అప్పుడప్పుడు నన్ను రామున్నిఅనుకోమన్నావ్..అట్లీస్ట్ ఇప్పుడైనా నా సీతావు అవుతావా'.

10) 'నచ్చడం.. ప్రేమించడం ఒకటి కాదు'