Asianet News TeluguAsianet News Telugu

వైరల్ వీడియో: పునీత్ రాజ్ కుమార్ చివరి క్షణాలు... ఆసుపత్రికి వెళ్లబోయే ముందు ఏం జరిగిందంటే!

పునీత్ మరణించిన రోజు నాటి సీసీ టీవీ ఫుటేజ్ బయటికి వచ్చింది. దాని ప్రకారం ప్రచారం అవుతున్న కథనాల్లో నిజం లేదని తేలింది. ఆ రోజు Puneeth rajkumar సరిగ్గా ఉదయం 11 గంటలకు ఇంటి నుండి బయటికి వచ్చారు.

this what happend to puneeth rajkumar before he dead
Author
Hyderabad, First Published Nov 3, 2021, 2:43 PM IST


అక్టోబర్ 29 శుక్రవారం  స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మృతి చెందారు. సడన్ గా ఆయన హార్ట్ స్ట్రోక్ కి గురికావడమే మరణానికి కారణం అని వైద్యులు ధ్రువీకరించారు. పునీత్ తన లేటెస్ట్ మూవీలోని పాత్ర కోసం అతిగా జిమ్ చేశారని, దాని ఫలితంగా ఆయన హార్ట్ స్ట్రోక్ కి గురయ్యారని వాదనలు వినిపించాయి. 

అయితే మెల్లగా అసలు నిజాలు బయటికి వస్తున్నాయి. పునీత్ మరణించిన రోజు నాటి సీసీ టీవీ ఫుటేజ్ బయటికి వచ్చింది. దాని ప్రకారం ప్రచారం అవుతున్న కథనాల్లో నిజం లేదని తేలింది. ఆ రోజు Puneeth rajkumar సరిగ్గా ఉదయం 11 గంటలకు ఇంటి నుండి బయటికి వచ్చారు. సర్ ఆసుపత్రికి వెళ్లాలని అక్కడి స్టాఫ్ కి భార్య ముందుగా వచ్చి సమాచారం ఇచ్చారు. వెంటనే డ్రైవర్ తో పాటు సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. కారు వరకు కూడా పునీత్ స్వయంగా నడుచుకుంటూ వచ్చారు. కారు సిద్ధం చేసే వరకు కొన్ని సెకన్లు అక్కడ నిల్చున్నారు. ఆ తరువాత భార్యతో పాటు కారెక్కి, విక్రమ్ ఆసుపత్రికి బయలుదేరారు. 


సీసీ టీవీ ఫుటేజ్ ప్రకారం కారు ఎక్కే వరకు కూడా పునీత్ ఆరోగ్యంగా కనిపించారు. కారు ఎక్కిన తరువాత క్షణాల్లో ఆయన భార్య వడిలో కుప్పకూలిపోయారట. విక్రమ్ ఆసుపత్రిలో ఐసీయూ సిద్ధం చేసి ఉంచాలని ముందుగానే ఇన్ఫార్మ్ చేశారట. సడన్ గా పునీత్ గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఇది రక్త ప్రసరణ హెచ్చుతగ్గుల వలన వచ్చిన గుండె పోటు కాదు, సడన్ స్ట్రోక్ అని డాక్టర్స్ చెబుతున్నారు. విధి ఎంత విచిత్రమైనదో పునీత్ రాజ్ కుమార్ మరణం నిదర్శనం. 


కాగా నేడు కొద్దిసేపటి క్రితం రామ్ చరణ్ పునీత్ కుటుంబ సభ్యులను బెంగూళూరులోని వారి నివాసంలో కలిశారు. పునీత్ అన్నగారైన శివ రాజ్ కుమార్ ని పరామర్శించారు. ముందుగా పునీత్ చిత్ర పటానికి పూలతో నివాళులు అర్పించారు Ram charan. ఇక నిన్న నాగార్జున పునీత్ కుటుంబ సభ్యులను కలవడం జరిగింది. 

Also read పునీత్ రాజ్ కుమార్ ని అవమానిస్తూ పోస్ట్.. నెటిజన్ అరెస్ట్, అంతా శోకంలో మునిగిపోయిన వేళ
 అంత్యక్రియలకు మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి హాజరైన విషయం తెలిసిందే. నందమూరి ఫ్యామిలీ తరపున బాలకృష్ణ, Ntr స్వయంగా పాల్గొన్నారు. బాలయ్య పునీత్ మృతదేహం వద్ద కన్నీరు పెట్టుకున్నారు. ఇక టాలీవుడ్ నుండి వెంకటేష్, శ్రీకాంత్, ఆలీ పునీత్ అంత్యక్రియలకు హాజరయ్యారు.  
Also read Puneeth rajkumar : జిమ్ చేయడం వలన కాదు, పునీత్ మరణానికి అసలు కారణం అదే

Follow Us:
Download App:
  • android
  • ios