ప్రతి వీకెండ్ థియేటర్స్ లో కొత్త సినిమాలు ఎలా సందడి చేస్తాయో.. అలాగే ఓటిటి వేదిక కూడా సినీ ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందుతోంది.

ప్రతి వీకెండ్ థియేటర్స్ లో కొత్త సినిమాలు ఎలా సందడి చేస్తాయో.. అలాగే ఓటిటి వేదిక కూడా సినీ ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందుతోంది. రీసెంట్ గా విడుదలైన చిత్రాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు, ఒరిజినల్ చిత్రాలని ఓటిటి సంస్థలు తమ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ లోకి తీసుకువస్తుంటారు. 

ఈ వీకెండ్ కూడా కొన్ని ఆసక్తికర చిత్రాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆహా వేదిక గా మూడు కొత్త చిత్రాలు ఫిబ్రవరి 17 నుంచి స్ట్రీమింగ్ మొదలయ్యాయి. అందులో సుడిగాలి సుధీర్ గాలోడు, బిగ్ బాస్ సోహైల్ నటించిన లక్కీ లక్ష్మణ్.. సంతోష్ శోభన్, ప్రియా భవాని శంకర్ జంటగా నటించిన కళ్యాణం కమనీయం చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలేవీ థియేటర్స్ లో రాణించలేదు. మరి ఓటిటి లో అయినా వీటికి ఆదరణ దక్కుతుందేమో చూడాలి. 

ఇక అయ్యప్ప స్వామి నేపథ్యంలో వచ్చిన 'మలికాపురం' చిత్రం కూడా ఓటిటిలో రిలీజయింది. డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటించారు. 

ఇదిలా ఉండగా డిస్ని ప్లస్ హాట్ స్టార్ సంస్థ అదిరిపోయే వెబ్ సిరీస్ ని ఈ వీకెండ్ తీసుకువచ్చింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 17న రిలీజయింది. ఫారెన్ లో పాపులర్ అయిన ఈ సిరీస్ ని ఇండియన్ లాంగ్వేజెస్ లోకి రీమేక్ చేశారు. ఈ వెబ్ సిరీస్ లో అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, శోభిత ధూళిపాళ కీలక పాత్రల్లో నటించారు. 

అలాగే అమేజాన్ ప్రైమ్ లో కార్నివాల్ రో 2 సిరీస్ స్ట్రీమింగ్ మొదలయింది. ఆసక్తికర చిత్రాలు లేకుంటే అద్భుతమైన వెబ్ సిరీస్ లు రెడీగా ఉన్నాయి. ఆడియన్స్ కి మాత్రం ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ.