ఈ శుక్రవారం మూడు సినిమా లు టాలీవుడ్ భాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఈ మూడింటిలో ఏది బాగున్నా భుజాన మోద్దామని ప్రేక్షకులు వెయిటింగ్ . అయితే అంత అవకాసం ఇవ్వలేదు. ప్లాఫ్ అవ్వటంలో ఈ మూడు సినిమాలు ఒకదానికొకటి పోటీ పడ్డాయి. ఆ సినిమాలు ఏంటంటే... ఫలక్ నుమా దాస్, ఎన్.జి.కె, అభినేత్రి 2 .

ఎన్.జి.కె, అభినేత్రి 2 ఈ రెండింటికి మినిమం క్రేజ్ కూడా రాలేదు. దాంతో ఈ రెండు సినిమాలపై ఎక్సపెక్టేషన్స్ ఎవరూ పెట్టుకోలేదు. కానీ ట్రైలర్ , టీజర్స్, పోస్టర్స్ తో కిక్ ఇచ్చిన  ఫలక్ నుమా దాస్ సినిమా మాత్రం మాస్ లోకి వెళ్లిపోతుందని, అర్జున్ రెడ్డిలా ఆడేస్తుందని ఓ వర్గం బోలెడు ఆశలు, అంచనాలు పెట్టుకుంది. అయితే అంత సీన్ లేదని మార్నింగ్ షోకే అర్దమైపోయింది.

పనిగట్టుకుని తెలంగాణ స్లాంగులో బూతులు తిడితే ఎక్కదని తేలింది. మళయాళంలో కల్ట్ సినిమాగా పేరుతెచ్చుకున్న అంగమలై డైరీస్ రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం పూర్తిగా మందు అండ్ మటన్ తో  నింపేసారు. కానీ మనకు కేరళలో ఉన్నట్లు మటన్ మాఫియా లేకపోవటంతో పెద్దగా ఎవరూ కనెక్ట్ కాలేదు.    ఫలక్నుమా దాస్ సినిమా మొత్తం సాగదీయడంతో బోర్ కొట్టేసి ఎక్కడా వర్కవుట్ కాలేదు. 

ఇక  అభినేత్రి 2 చూసుకుంటే, తమన్నా ఆరబోసిన గ్లామర్ తప్పించి  సినిమాలో విషయం ఏమిలేదని బాక్సాఫీస్ టాక్. ఇక మిల్కీ బ్యూటి గ్లామర్ కు జనాలు ఎవరూ ఎగబడటం లేదు.

ఈ రెండు కాక...హీరో సూర్య ఎన్.జి.కె సినిమా సైతం స్టార్ కాస్టింగ్ తో దుమ్ము దులిపుతూ థియోటర్స్ కు వచ్చింది. అయితే సినిమాలో సూర్యతో పాటు సాయి పల్లవి అండ్ రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నా కంటెంట్ లేకపోతే ఖర్చు అయ్యిపోతారని మరోసారి ప్రూవ్ చేసింది.  దాంతో జనాలకు థియోటర్స్ లో ఇంకా ఆడుతున్న మహర్షి మాత్రమే దిక్కైంది.