బిగ్ బాస్ సీజన్ 4 మొదలై దాదాపు ఆరు వారాలు అవుతుంది. మొదటివారం హౌస్ నుండి దర్శకుడు సూర్య కిరణ్ ఎలిమినేట్ అయ్యారు. ఆ తరువాత కరాటే కళ్యాణి, దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్, జోర్దార్ సుజాత హౌస్ నుండి ఎలిమినేటై వెళ్లిపోయారు. గంగవ్వ బిగ్ బాస్ అనుమతితో హౌస్ నుండి స్వచ్ఛందంగా బయటికి రావడం జరిగింది. ఈ వారం కమెడియన్ కుమార్ సాయి ఎలిమినేట్ కావడం జరిగింది. 

నేడు సోమవారం కావడంతో మరలా ఎలిమినేషన్స్ కి నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఇంటిలోని సభ్యులను ఇద్దరు చొప్పున రంగు నింపి ఉన్న బకెట్స్ క్రింద నిలుచొని ఉండాలని...ఆ ఇద్దరు చర్చించుకొని ఎవరు నామినేట్ కావాలో, ఎవరు హౌస్ లో ఉండాలో ఒక నిర్ణయానికి రావాలని చెప్పడం జరిగింది. కోరి ఎవరూ ఎలిమినేషన్ లిస్ట్ లోకి చేరాలని అనుకోరు కాబట్టి అందరూ హౌస్ లో కొనసాగుతాం అన్నారు. 

ఈ విషయంలో అభిజిత్, హరికలకు వాగ్వాదం జరిగింది. వారిద్దరిలో ఎవరు నామినేట్ అవుతారో చెప్పుమనగా...ఈ హౌస్లో ఎక్కువసార్లు నేను నామినేట్ అయ్యానని అభిజిత్ చెప్పారు. హారిక నా విషయంలో ఈ టాస్క్ టోటల్ అన్ ఫెయిర్ అని కన్నీళ్లు పెట్టుకుంది. అభిజిత్ హారికకు ఏదో  చెప్పబోతుండగా షటప్ అని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. 

ఈ సీరియస్ టాస్క్ లో ఆరియానా, మెహబూబ్ మధ్య పోటీ రాగా ఇద్దరూ హౌస్ లో ఉంటాం అని గొడవ పడ్డారు. అవినాష్, సోహైల్ కూడా ఇద్దరం ఎలిమినేట్ కావాలని కోరుకోవడం లేదని చెప్పారు. ఈ ఎలిమినేషన్స్ టాస్క్ లో అఖిల్-మోనాల్, దివి-లాస్య  పోటీపడ్డారు. తాజా ప్రోమోలో ఈ ఆసక్తికర సన్నివేశాలతో విడుదల చేశారు. మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఏమి జరగనుందో అనేది ఉత్కంఠ రేపుతోంది.