ఒక్క అవకాశం చాలు జీవితం మారిపోవడానికి, ఒక్క సినిమా చాలు నటుడు స్టార్ హీరో కావడానికి. అలాంటి సినిమానే అర్జున్ రెడ్డి. కనీస ఫేమ్ లేని విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. గీత గోవిందం మూవీతో ఆయన ఫేమ్ మరో లెవెల్ కి వెళ్ళింది. బాలీవుడ్ లో కూడా విజయ్ కి క్రేజ్ ఉండగా లైగర్ మూవీతో అక్కడ అడుగుపెడుతున్నారు. దర్శకుడు పూరి లైగర్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. 


విజయ్ దేవరకొండ ఫేమ్ ఏమిటో ఓ ప్రముఖ సంస్థ సర్వే ద్వారా రుజువైంది. బాలీవుడ్ బడా బాబులను కూడా కాదని టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020' లిస్ట్‌ విజయ్ దేవరకొండ .. నేషనల్ వైడ్‌గా రెండో స్థానం దక్కించుకున్నాడు. స్టార్స్‌న, స్టార్ క్రికెటర్లనువెనక్కు నెట్టి విజయ్ సెకండ్ ప్లేస్ అందుకున్నాడు. గత ఏడాది మూడో ప్లేస్‌లో ఉన్న విజయ్, ఈ ఏడాది గానూ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆన్‌లైన్ ఓటింగ్, జ్యూరీ అభిప్రాయాల ఆధారంగా వివిధ రంగాల్లోని సెలబ్రిటీలతో టాప్ 50 మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ తయారు చేసింది టైమ్స్ గ్రూప్.


 ఈ ఆన్‌లైన్ ఓటింగ్‌లో గత ఏడాది మరణించిన బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తొలి స్థానం దక్కడం విశేషం. ఆయన తరువాత సెకండ్వి ప్లేస్ విజయ్ దేవరకొండ రాబట్టుకున్నారు.  వీరి తర్వాత స్థానాల్లో ఆదిత్య రాయ్ కపూర్, వికీ కౌశల్, దుల్కర్ సల్మాన్ టాప్ ఫైవ్ లో నిలిచారు. రణ్వీర్ సింగ్, వికీ కౌషల్, రణ్ బీర్ కపూర్ లాంటి బాలీవుడ్ స్టార్స్ అంతా వీరి తర్వాత ప్లేస్‌లలో ఉండిపోయారు. మరో విశేషం ఏమిటంటే.. ఈ 50 లిస్ట్‌లో విజయ్ , రానా దగ్గుబాటిలకు మినహా మరో తెలుగు హీరోకి చోటు దక్కలేదు.  రానా 28వ స్థానం దక్కించుకోవడం జరిగింది.