హీరో రామ్ ట్వీట్స్ సంచలనం రేపుతున్నాయి. గత రెండు రోజులుగా ఆయన స్వర్ణ ప్యాలస్ అగ్నిప్రమాద ఘటనపై వరుస ట్వీట్స్ వేస్తున్నారు. విజయవాడ స్వర్ణ ప్యాలస్ హోటల్ ని రమేష్ హాస్పిటల్స్ కోవిడ్ సెంటర్ గా నిర్వహిస్తుండగా,  అగ్నిప్రమాదం జరిగి కొందరు రోగులు మరణించారు. ఈ కేసులో రమేష్ చౌదరి పై ఎఫ్ ఐ ఆర్  నమోదు కావడం జరిగింది. కాగా హీరో రామ్ ఈ ఘటనలో కొందరు కావాలనే రమేష్ చౌదరిని ఇరికిస్తున్నారని, ద్రోషులు తప్పించుకోవడానికి అమాయకులను బలి చేస్తున్నారన్న అర్థంలో ట్వీట్స్ వేయడం జరిగింది. 

రామ్ ట్వీట్స్ కి పోలీసు అధికారులు అభ్యంతరం తెలిపారు. సంఘటన గురించి పూర్తిగా తెలియకుండా ఇలాంటి ట్వీట్స్ వేస్తే నోటీసులు జారీ చేయాల్సివస్తుందని హెచ్చరించారు. దీనితో ఇకపై ఈ విషయంపై తాను స్పందిచను అని ట్వీట్ చేయడం జరిగింది. ఈ విషయంపై చంద్రబాబు నాయుడు మనిషి స్వేచ్ఛను హరిస్తున్నారని ఏపి ప్రభుత్వాన్ని విమర్శించారు. కాగా నేడు హీరో రామ్ మరొక సంచలన ట్వీట్ చేయడం జరిగింది. కరోనా కంటే కూడా క్యాస్ట్ వేగంగా వ్యాపిస్తుందని, ఈ క్యాస్ట్ ఫీలింగ్ చాలా ప్రమాదకరమైంది. కావున దీనికి దూరంగా ఉండాలని తన ట్వీట్ లో తెలియజేశారు. 

రామ్ పరోక్షంగా ఆంద్రప్రదేశ్ లో ఈ క్యాస్ట్ కారణంగా కొందరిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన చెప్పారు.అలాగే ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారనేది ఆయన ఉద్దేశంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా స్వర్ణ ప్యాలస్ ప్రమాద సంఘటనను రామ్  చాలా సీరియస్ గా తీసుకున్నారని అనిపిస్తుంది.