ఓ కాలేజమ్మాయి.. డిగ్రీ చదివే రోజుల్లో పవన్ అనే కుర్రాడితో లవ్వులో పడింది. పీకల్లోతు ప్రేమలోకి దిగిపోయారు. కానీ.. అనివార్య కారణాల వల్ల ఆమె పెళ్లి ప్రకాష్ అనే మరొకడితో జరిగింది. కొన్నాళ్ల తర్వాత.. భర్త ఉద్యోగరీత్యా దుబాయ్ వెళ్లగా ఆమె ఒంటరిగా ఉంటోంది. సరిగ్గా ఈ గ్యాప్ లోనే మాజీ ప్రేమికుడు పవన్.. ‘టచ్’లోకి వచ్చాడు.
నంబర్ తెలుసుకుని వాట్సాప్ గ్రూప్ చాట్ లోకొచ్చి.. ‘నేను గుర్తున్నానా’ అంటూ ఫోన్లోనే కన్ను గీటాడు. ఈమె కాస్త పాజిటివ్ గా స్పందించేసరికి చనువు పెంచుకునే ప్రయత్నం చేశాడు. ఒక్కసారి కలుసుకుందామా? ఒక్కరోజు నాకు భార్యగా వుంటావా? అంటూ ఆఫర్ కూడా ఇచ్చాడు. ససేమిరా అనడంతో పాత ఫోటోలను చూపించి బ్లాక్ మెయిల్ చేయబోయాడు. సంసారం ఎక్కడ పాడవుతుందో అన్న భయంతో.. ఆమె అతడి ‘ఒక్కరోజు’ ఆఫర్ ని ఓకె చేసింది. కానీ.. అక్కడితో ఆగకుండా.. మళ్లీ మళ్లీ టచ్ లోకి రావడం మొదలుపెట్టి.. ప్రతిరోజూ టార్చర్ పెట్టేసరికి.. దీనికి ఫుల్ స్టాప్ పెట్టెయ్యాలన్న నిర్ణయానికొచ్చిందామె! భర్త ప్రకాష్ కి ‘జరిగిన కథ’ మొత్తం పూసగుచ్చినట్లు చెప్పి.. తాను ఏ పరిస్థితుల్లో అలా చెయ్యాల్సివచ్చిందో వివరించి.. అతడ్ని కన్విన్స్ చెయ్యగలిగింది. ప్రకాష్ ‘పెద్ద మనసు’ చేసుకుని.. ఆమెను ఈ ఊబిలోంచి కాపాడాలని నిర్ణయించుకున్నాడు. ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ కి వచ్చి.. ఫిర్యాదు రాసి.. అతడి మీద కేసు పెట్టించారు. దీంతో ఆమె కథ సుఖాంతం! ఇటీవల విడుదలైన ‘నిన్ను కోరి’ సినిమా కథకు దాదాపుగా దగ్గరగా వున్న ఈ యదార్థ గాధకు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. 
నీతి: బ్లాక్ మెయిలర్లకు లొంగిపోకండి.. ఇటువంటి వెధవల్ని మొదట్లోనే తుంచెయ్యండి..!