Asianet News TeluguAsianet News Telugu

‘ఎఫ్3’లో వింటేజ్ సునీల్ ను చూస్తారు : సునీల్.. ఎఫ్2ను మించిన కామెడీ ఖాయం..

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎఫ్3’ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా సునీల్ మీడియాతో మాట్లాడుతూ సినిమాలో తన పాత్రపై ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్ ను వెల్లడించారు.  
 

This is what Sunil looks like in F3 Movie, Interesting details
Author
Hyderabad, First Published May 14, 2022, 6:51 PM IST

‘ఎఫ్2’తో తెలుగు ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నారు అనిల్ రావిపూడి (Anil Ravipudi). దానికి సీక్వెల్ గా వుస్తున్న చిత్రం ‘ఎఫ్3’ (F3). ఈ మూవీతో మరోసారి నవ్వుల పండుగ ప్రారంభం కానుంది. మొదటి పార్ట్ లో ఫ్యామిలీతో కలిగే ఫ్రస్టేషన్ ను చూపించారు. ఈ సారి మనీతో మనుషులకు కలిగే ఫ్రస్టేషన్ ను హాస్యరూపకంగా ‘ఎఫ్3’ ద్వారా చూపించనున్నారు. ఈ చిత్రం రిలీజ్ కు అన్ని విధాలా సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, మేకింగ్ వీడియోస్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రస్తుతం చిత్ర  ప్రచార కార్యక్రమల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా సునీల్ మీడియాతో ఇంటారాక్ట్ అయ్యారు. ఈ సినిమాలో తను ఎలా కనిపించబోతున్నాడో వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. 

కమెడియన్ గా దశాబ్ధం కాలం పాటు తెలుగు ప్రేక్షకులను అలరించాడు  సునీల్ (Sunil). ఉన్నట్టుండి ‘అందాల రాముడు, పూల రంగడు, మిస్టర్ పెళ్లి కొడుకు’ చిత్రాలతో హీరోగా మారిపోయాడు. ఇది తన కేరీర్ లో సునీల్ చేసిన బిగ్ స్టంట్ అనే చెప్పాలి. కమెడియన్ గా అలరించిన సునీల్ సిక్స్ ప్యాక్ తో ‘పూలరంగడు’ చిత్రంతో మెప్పించడం టాలీవుడ్ లో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత సునీల్ ఎక్కువగా కామెడీ పాత్రలకు ప్రాధ్యనత్య ఇవ్వడం లేదు. తన వద్దకు వచ్చిన  సినిమాల్లో పలు కీలక పాత్రలోనే నటిస్తూ వస్తున్నాడు. 

‘పుష్ప : ది రైజ్’. ఈ మూవీలో సునీల్ ఏకంగా విలన్ పాత్ర (మంగళం శ్రీను)లోనూ మెప్పించాడు. అంతకు ముందు ‘కలర్ ఫొటో’తో తనలోని విలనిజాన్ని చూపించాడు సునీల్. మరిన్ని చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. సునీల్ ఎన్నిపాత్రల్లో నటించిన ఆయన కామెడీని మాత్రం తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ ఇష్టపడుతూనే ఉంటారు. ఈ మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్3’(F3)తో వింటేజ్ సునీల్ ను చూస్తామని సునిల్ చెబుతున్నారు. ఫుల్ లెన్త్ రోల్ లో ఈ సినిమా మొత్తం నవ్వులు పూయించడం ఖాయమంటున్నారు. చాలా కాలం తర్వాత ఇలాంటి రోల్ లో నటించడం బాగుందని తెలిపారు. ఫస్ట్ హాఫ్ లో సోలో పర్ఫార్మెన్స్ చేసినా.. సెకండ్ ఆఫ్ లో వరుణ్ తేజ్ తో కలిసి కామెడీ కుమ్మేసినట్టు  చెప్పారు. ఎఫ్2 నుంచి మించిన కామెడీ ఎఫ్3లో ఉందని తెలిపారు.

ఈ చిత్రానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించారు. హీరోహీరోయిన్లుగా విక్టరీ వెంకటేశ్(Venkatesh), వరుణ్ తేజ్ (Varun Tej), తమన్నా భాటియా (Tamannaah), మెహరీన్ ఫిర్జాదా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ మే 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios