హిందీ బిగ్ బాస్ రియాలిటీ షోకి ఉన్న ప్రాధాన్యత వేరు. దేశవ్యాప్తంగా ఈ షో కోసం ఎదురు చూస్తారు. సల్మాన్ హోస్ట్ గా సాగే బిగ్ బాస్ షోకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. కాగా బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ గ్రాండ్ గా మొదలైంది. హోస్ట్ సల్మాన్ బిగ్ బాస్ సీజన్ 4ని గ్రాండ్ గా ప్రారంభించడం జరిగింది. నిక్కీ తంబోలి, పవిత్ర పూనియా, జాస్మిన్ బాసిన్ వంటి ప్రముఖులు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ కావడం జరిగింది. బిగ్ బాస్ హౌస్ లో ప్రవేశించిన సెలెబ్రిటీలు ఆసక్తి రేపుతుండగా షో మరింత కేజ్రీగా తయారైంది. 

బిగ్ బాస్ ప్రారంభ కార్యక్రమంలో లో ఓ ఆసక్తికర విషయం చోటు చేసుకుంది. హౌస్ లోకి ప్రవేశించిన కంటెస్టెంట్స్ భవిష్యత్ చెప్పడానికి సల్మాన్ ఓ పండితుడిని  పిలిపించారు. బిగ్ బాస్ వేదికపై ఆ పండితుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాగా సల్మాన్ ఆ పండితుడిని తన పెళ్లి గురించి అడగడం విశేషంగా మారింది. అంతకు మించిన ఆసక్తికర సమాధానాలు ఆ పండితుడు సల్మాన్ తో చెప్పారు. 

సల్మాన్ పెళ్లిపై ఆ పండితుడు షాకింగ్ ఆన్సర్స్ చెప్పారు. సల్మాన్ కి సమీప కాలంలో పెళ్లి యోగం లేదని చెప్పాడు. సల్మాన్ జాతకరీత్యా గ్రహాలు సరిగా లేవని, పెళ్లి యోగం భగ్నమైపోయిందని ఆ పండితుడు చెప్పారు. ఇక తనకు పెళ్లి అయ్యే అవకాశం లేదా అని పండితుడిని సల్మాన్ అడుగగా, దాదాపు లేనట్లే అని సమాధానం చెప్పారు. దీనితో సల్మాన్ హమ్మయ్య బ్రతికిపోయాను అన్నట్లు ఊపిరి పీల్చుకోవడం విశేషం.