Asianet News TeluguAsianet News Telugu

పొలిటికల్ ఎంట్రీపై సోనూ సూద్ మనసులో మాట ఇదే!


సేవా గుణం ఉన్న సోనూసూద్ రాజకీయాలలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈ డిమాండ్ వినిపిస్తుంది. కొందరు నేరుగా సోనూ సూద్ ని రాజకీయాలలోకి రావాలని ఒత్తిడి చేస్తున్నారు. మరి సోనూ సూద్ మనసులో ఏముంది అనేది తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టారు ఆయన. 

this is latest comment of sonu sood on his political entry ksr
Author
Hyderabad, First Published Jun 9, 2021, 6:53 PM IST

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సోనూ సూద్ అనే పేరు తెలియనివారు లేరు. ప్రతి రాష్ట్రంలో ప్రత్యక్షంగా పరోక్షంగా అతని సహాయం పొందినవారు వందల సంఖ్యలో ఉన్నారు. గత ఏడాది మొదలైన కరోన సంక్షోభ పరిస్థితుల నుండి అనేక మంది పేదలను ఆయన అక్కున చేర్చుకున్నారు. అడిగిందే తడవుగా వాళ్ళ అవసరాలు, ఇబ్బందులు తీర్చారు. 


కష్టపడి సంపాదించుకున్న సొంత డబ్బులు పేదల కోసం ఖర్చు చేస్తూ కలియుగ కర్ణుడు అయ్యాడు సోనూ సూద్. ఇలాంటి సేవా గుణం ఉన్న వ్యక్తి రాజకీయాలలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈ డిమాండ్ వినిపిస్తుంది. కొందరు నేరుగా సోనూ సూద్ ని రాజకీయాలలోకి రావాలని ఒత్తిడి చేస్తున్నారు. మరి సోనూ సూద్ మనసులో ఏముంది అనేది తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టారు ఆయన. 

సోనూ సూద్ మాట్లాడుతూ... ప్రజాసేవ చేయడానికి రాజకీయాలు మంచి వేదిక. అయితే వెంటనే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం నాకు లేదని అన్నారు. ఐతే ఆరేడేళ్ల తర్వాత రాజకీయాల్లోకి వస్తానేమో అంటూ, రాజకీయాలపై తనకు ఆసక్తి ఉన్న విషయం బయటపెట్టారు.. ప్రస్తుతం తాను చేస్తున్న సేవపై సంతృప్తిగా ఉన్నానని సోనూసూద్‌ తెలిపారు. ప్రజాసేవకు రాజకీయాలు మంచి వేదికైనా.... ఇప్పటికిప్పుడు రాజకీయాల్లో కి వచ్చే ఉద్దేశం మాత్రం లేదన్నారు. రాజకీయాల్లోకి రావడానికి తానింకా మానసికంగా సిద్ధంకాలేదదన్నారు. గతంలో పలు పార్టీలు తనను ఆహ్వానించాయని, కానీ అప్పుడు ఇంట్రస్ట్ చూపలేదని సోనూసూద్‌ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios