టాలీవుడ్ ద్వారా వెండితెరకు పరిచయమైన తాప్సి ప్రస్తుతం బాలీవుడ్ లో హవా సాగిస్తుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు బెస్ట్ ఛాయిస్ గా ఆమె మారిపోయారు. ప్రతి ఏడాది రెంటికి పైగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తున్నారు. తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని ముందుకు వెళుతున్నారు తాప్సి. కాగా తాప్సి తన తాజా చిత్రం కోసం ఎంత కష్టపడ్డారో సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఓ అథ్లెట్ పాత్ర కోసం... రియల్ అథ్లెట్ కి మించి కష్టపడ్డారు తాప్సి.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Taapsee Pannu (@taapsee)

 
రష్మీ రాకెట్ పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో తాప్సి ప్రొఫెషనల్ రన్నర్ గా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన మూడో రోజు, ట్రాక్ పై పరుగెత్తే సన్నివేశం తెరకెక్కించే సమయంలో తాను పరుగెత్తలేకపోయారట. కాసేపటికే ఆమె అలసిపోవడంతో పాటు, తాను పరుగెత్తే స్థితిలో లేనని అర్థం చేసుకున్నారట. జిమ్ లో కఠిన కసరత్తులు చేయడం ద్వారానే ఈ రోల్ కి న్యాయం చేయగలనని భావించిన తాప్సి... కఠిన శిక్షణ తీసుకున్నారట. గంటల తరబడి జిమ్ లో వ్యాయామం చేశారట. తన కష్టాన్ని వివరిస్తూ... తాప్సి కొన్ని స్పెషల్ వీడియోలు పంచుకున్నారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Taapsee Pannu (@taapsee)

 
కెమెరా ట్రిక్స్, విఎఫ్ఎక్స్ వర్క్ తో మేనేజ్ చేసే అనేక టెక్నిక్స్ అందుబాటులో ఉండగా, తాప్సి రియాలిటీ కోసం ఈ రేంజ్ లో కష్టపడడం అభినందించాల్సిన విషయమే. ఇక రష్మీ రాకెట్ షూటింగ్ ఇటీవలే తిరిగి మొదలుకాగా తాప్సి పాల్గొంటున్నారు. ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తాప్సికి జంటగా ప్రియాంషు పెన్యూలి నటిస్తున్నారు. ఇదికాక మరో మూడు చిత్రాలు తాప్సి చేతిలో ఉన్నాయి.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Taapsee Pannu (@taapsee)