ఆ నిర్మాత చెవిపై ముద్దు పెట్టబోయాడు: స్వరా భాస్కర్

First Published 30, Jun 2018, 10:58 AM IST
This guy tried to kiss my ear says swara bhaskar
Highlights

ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా అన్ని ఇండస్ట్రీలలో కాస్టింగ్ కౌచ్ గురించి నటీమణులు 

ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా అన్ని ఇండస్ట్రీలలో కాస్టింగ్ కౌచ్ గురించి నటీమణులు బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే చాలా మంది తారలు తాము ఎదుర్కొన్న సంఘటనలను బయటపెట్టారు. 

రీసెంట్ గా స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ సైతం ఇండస్ట్రీలో తను ఫేస్ చేసిన ఓ సంఘటనను వివరించింది. తాజాగా నటి స్వరా భాస్కర్ కూడా కాస్టింగ్ కౌచ్ పై పెదవి విప్పింది. ఓ నిర్మాత తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు స్పష్టం చేసింది. సదరు నిర్మాత తన చెవిపై ముద్దుపెట్టే ప్రయత్నం చేశాడని, వెనుక నిల్చొని తనను ప్రేమిస్తున్నట్లు చెప్పాడని దీంతో తను పక్కకు తప్పుకొని వెళ్లిపోయినట్లు చెప్పుకొచ్చింది.

ఇదంతా కూడా కాస్టింగ్ కౌచ్ లో భాగమే కదా అని గుర్తుచేసుకున్నారు. ఇటీవల స్వరా నటించిన 'వీరే ది వెడ్డింగ్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమె 'ప్రస్థానం' హిందీ రీమేక్ లో అవకాశం దక్కించుకుంది. ఇందులో సంజయ్ దత్, మనీషా కోయిరాలా వంటి తారాలు కనిపించనున్నారు. 

loader