ఈ శుక్రవారం(మార్చి 3)న చిన్న సినిమాల జాతర సాగబోతుంది. పెద్ద సినిమాలు లేకపోవడంతో చిన్న చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఆ సినిమాలేంటో చూద్దాం.
ఫిబ్రవరి నుంచి మార్చి మూడు వారం వరకు సినిమాలకు గడ్డు పరిస్థితి ఉంటుంది. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ తో బిజీగా ఉంటారు. దీంతో వాళ్లు థియేటర్‌కి రాలేని పరిస్థితిలో ఉంటారు. అందుకే ఈ టైమ్‌లో పెద్ద సినిమాల రిలీజ్‌లు ఉండవు. ఇది చిన్న సినిమాలకు హెల్ప్ అవుతుంది. ఈ టైమ్‌లోనే వాటికి థియేటర్లు దొరుకుతుంటాయి. స్టూడెంట్స్ లోటు ఆయా సినిమాలకు కూడా ఉంటాయి. కానీ తప్పదు, ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు, అందుకే రిలీజ్‌కి వస్తున్నారు తక్కువ బడ్జెట్ చిత్రాలు. ఈ శుక్రవారం `బలగం`, `ఆర్గానిక్ మామా హైబ్రిడ్ అల్లుడు`, `రిచిగాడి పెళ్లి`, `సాచి`, `గ్రాంథాలయం` వంటి చిత్రాలు ప్రధానంగా ఉన్నాయి. కానీ ఊహించని విధంగా ఇప్పుడు ఈ చిత్రాలపై `ఆర్‌ఆర్‌ఆర్` బెబ
అందులో భాగంగా ఈ శుక్రవారం దాదాపు ఏడెనిమిది సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఓటీటీ కలుపుకుని పదికిపైగానే చిత్రాలు వస్తున్నాయి. అందులో ప్రధానంగా బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ నటించిన `ఆర్గానికి మామ హైబ్రిడ్ అల్లుడు` చిత్రం ఉంది. దీన్ని ఎస్వీకృష్ణారెడ్డి రూపొందించడం విశేషం. సోహైల్‌కి జోడీగా మృణాళిని నటించగా, రాజేంద్రప్రసాద్, మీనా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కె అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మించారు. మార్చి 3న సినిమా రిలీజ్ కానుంది.
దీంతోపాటు మరో ప్రామిసింగ్ మూవీ `బలగం` రాబోతుంది. దిల్ రాజు నిర్మాణం నుంచి వస్తోన్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలున్నాయి. ప్రయదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, మురళీధర్, సుధాకర్‌రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ హాస్య నటుడు వేణు ఎల్లంది ఈ చిత్రంతో దర్శకుడిగా మారడం విశేషం. ఈ చిత్రంతో హర్షిత్ రెడ్డి, హన్సిత నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. `ధమాకా` ఫేమ్ భీమ్స్ సంగీతం అందించారు. ఈ సినిమా మార్చి 3న రిలీజ్ కానుంది.
వీటితోపాటు `రిచిగాడి పెళ్లి` అనే మరో చిన్న సినిమా శుక్రవారమే రాబోతుంది. సత్య, చందన్ రాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి కె ఎస్ హేమ రాజ్ దర్శకత్వం వహఙంచారు. కేఎస్ ఫిల్మ్స్ వర్క్ నిర్మించింది. మరోవైపు ఇటీవల ప్రభాస్ ట్రైలర్ రిలీజ్ చేసిన `సాచి` చిత్రం కూడా ఈ ఫ్రైడేనే ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. `బిందు అనే యువతి నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా ఇది. సంజనరెడ్డి, గీతిక రధన్ ప్రధాన పాత్రల్లో నటించారు. వివేక్ పోతగోని దర్శకత్వం వహించారు.
అలాగే `గ్రంథాలయం` అనే మరో చిన్న బడ్జెట్ మూవీ రిలీజ్ కాబోతుంది. విన్ను మద్దిపాటి, స్మిరిత రాణి జంటగా నటించిన ఈ సినిమాకి సాయి శివన్ జంపన దర్శకత్వం వహించారు. వైష్ణవి శ్రీ నిర్మించారు. శుక్రవారం సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తుంది. `గురు` ఫేమ్ రితికా సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న `ఇన్‌కార్` సినిమా మార్చి 3న విడుదలకానుంది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ గోయత్, మనీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే చిరంజీవి హిట్ మూవీ `గ్యాంగ్‌లీడర్`ని సైతం ఈశుక్రవారమే రీ రిలీజ్ చేస్తున్నారు. మలయాళ డబ్బింగ్ సినిమా `ది పులి 19 సెంచరీ` తో పాటు హాలీవుడ్ డబ్బింగ్ మూవీ `బిగ్ స్నేక్ కింగ్ కూడా మార్చి 3న తెలుగులో రిలీజ్ కాబోతున్నాయి.
ఇవన్నీ థియేటర్లలో రిలీజ్ కాబోతుండగా, వీటిపై ఇప్పుడు కొత్తగా `ఆర్‌ఆర్‌ఆర్` దెబ్బపడబోతుంది. ఈ సినిమా ఆస్కార్ బరిలో ఉన్న నేపథ్యంలో, విడుదలై ఏడాది కావస్తున్న నేపథ్యంలో సినిమాని రీ రిలీజ్ చేస్తున్నట్టు యూనిట్ ప్రకటించింది. మార్చి 3నే ఈ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నట్టు వెల్లడించింది. ఇది చిన్న సినిమాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దొరక్క దొరక్క దొరికిన ఒక్క డేట్‌ని ఇలా పెద్ద సినిమా రీ రిలీజ్ పేరుతో దెబ్బ కొట్టడం బాధాకరం.
ఇక ఓటీటీలో విడుదలయ్యే సినిమాల లిస్ట్ చూస్తే, హాట్ స్టార్‌లో `ది మాండలోరిన్`(వెబ్ సిరీస్)- మార్చి 1న, మార్చి3న- `గుల్మొహర్`, `ఎలోన్`, అమెజాన్ ప్రైమ్‌లో `డైసీ జోన్స్ అండ్ ది సిక్స్(వెబ్ సిరీస్), జీ 5లో `తాజ్‌ః డివైడెడ్ బై బ్లడ్(వెబ్ సిరీస్` శుక్రవారం విడుదల కనున్నాయి. మరోవైపు నెట్ ఫ్లిక్స్ లో మార్చి 1న `హీట్ వేవ్`, మార్చి 2న `సెక్స్ లైఫ్`, మార్చి మూడున `థలైకూతల్` విడుదల కానుంది.
