Asianet News TeluguAsianet News Telugu

‘ఎన్టీఆర్ 30’ షూటింగ్ కు ఈ డేట్ ఫిక్స్.. పక్కాగా ప్లాన్ చేస్తున్న మేకర్స్.!

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత యంగ్  టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్ 30’ (NTR30). కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. మూవీ షూటింగ్ పై తాజాగా అప్డేట్ అందింది. ఈసారి పక్కాగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
 

This date is fixed for the shooting of NTR 30, The makers are planning well!
Author
First Published Oct 3, 2022, 4:32 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)- దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంతో రూపుదిద్దుకోబోతున్న చిత్రం ‘ఎన్టీఆర్ 30’. ఈ చిత్రాన్నిఅనౌన్స్ చేసి నెలలు నెలలు గడుస్తున్నా..  ఇంకా షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. ‘ఆర్ఆర్ఆర్’ కూడా విడుదలై ఆరు నెలలు దాటిపోయింది. దీంతో ఇంకెప్పుడు కొరటాల శివ-ఎన్టీఆర్ సినిమా ప్రారంభం కాబోతుందని అంటున్నారు. కొద్దిరోజులుగా మూవీ ప్రారంభంపైనా వరుస అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అభిమానులు ఖుషీ అయ్యేలా మరో క్రేజీ అప్డేట్ అందింది. 

ఇప్పటికే చాలా మార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రానికి ఎన్టీఆర్ ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. చిత్రాన్ని నవంబర్ ఫస్ట్ వీక్ లో ప్రారంభించాలని ప్లాన్ చేశారంట. ఇప్పటికే చిత్రం కోసం హైదరాబాద్ లోనూ భారీ సెట్ ను వేయించి పెట్టారు. సెట్ కూడా కాస్తా దెబ్బతినడంతో ప్రస్తుతం మరమ్మతులు చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఎన్టీఆర్ కూడా ఈ చిత్రం కోసం తన మేక్ ఏవోర్ ను కూడా మార్చుకున్నారు. చాలా వరకు బరువు కూడా తగ్గారు. డిఫరెంట్ లుక్ లో ఇప్పటికే ఆకట్టుకుంటున్నాడు. 

నవంబర్ లో ఎట్టిపరిస్థితుల్లోనూ ‘ఎన్టీఆర్ 30’ చిత్ర షూటింగ్ ను ప్రారంభించి,  వచ్చే ఏడాది 2023 సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇక సినిమాను రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన మోషన్ పోస్టర్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు చిత్రంలోనూ హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Madanna) నటించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios