Asianet News TeluguAsianet News Telugu

ఫోటోలో కనిపిస్తున్న పాల బుగ్గల చిన్నారిని గుర్తుపట్టారా  .. ఇప్పుడు బుల్లితెర పై క్రేజీ  యాంకర్ 

ఫోటోలో గుండ్రటి ముఖం, పెద్ద కళ్ళు, పాల బుగ్గలతో చాలా క్యూట్ కనిపిస్తున్న చిన్నారి మరెవరో కాదు యాంకర్ శ్రీముఖి.  ఇప్పుడు శ్రీముఖి  స్టార్ మా ఛానల్ లో  నీతోనే డాన్స్ 2.0 షో కు యాంకర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ చిన్ననాటి ఫొటోలతో పాటు .. జడ్జిలు, యాంకర్ ఫోటోలు చూపించారు. ఫోటోలో ఉన్నది ఎవరో  మిగిలిన వాళ్ళు కనిపెట్టాలి అని టాస్క్ జరిగింది.

this baby now  a crazy  anchor juts find  out ksr
Author
First Published Jun 24, 2024, 9:49 PM IST | Last Updated Jun 24, 2024, 9:48 PM IST


ఫొటోలో చాలా ముద్దుగా  కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా. ఈ బుజ్జాయి ఇప్పుడు ఒక స్టార్ యాంకర్. బుల్లితెర పై ఈ ముద్దుగుమ్మ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అమ్మడు హోస్ట్ చేస్తే ఆ షో  సూపర్ హిట్ అంతే. తన చలాకి తనం ఎనర్జీ లెవెల్స్ తో షోలో జోష్ నింపేస్తుంది. ఒక స్టాండప్ కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చింది. అంచెలంచలుగా ఎదుగుతూ ఇప్పుడు  స్టార్ హోదా సంపాదించింది. ఇప్పుడు  బుల్లితెర ని ఎలేస్తుంది. 

ఫోటోలో గుండ్రటి ముఖం, పెద్ద కళ్ళు, పాల బుగ్గలతో చాలా క్యూట్ కనిపిస్తున్న చిన్నారి మరెవరో కాదు యాంకర్ శ్రీముఖి.  ఇప్పుడు శ్రీముఖి  స్టార్ మా ఛానల్ లో  నీతోనే డాన్స్ 2.0 షో కు యాంకర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ చిన్ననాటి ఫొటోలతో పాటు .. జడ్జిలు, యాంకర్ ఫోటోలు చూపించారు. ఫోటోలో ఉన్నది ఎవరో  మిగిలిన వాళ్ళు కనిపెట్టాలి అని టాస్క్ జరిగింది. 

ఈ క్రమంలో శ్రీముఖి చిన్ననాటి ఫోటో స్క్రీన్ పై వేశారు. ఇక ఫోటో చూడగానే నయని పావని వెంటనే చెప్పేసింది. ఆ తర్వాత బ్రిట్టో కూడా శ్రీముఖి అని చెప్పాడు. ఇక శ్రీముఖి హోస్ట్ చేస్తున్న నీతోనే డాన్స్ 2.0 ఫినాలే కి వచ్చేసింది. వచ్చే ఆదివారంతో షో కి ఎండ్ కార్డు పడబోతోంది. ఈ క్రమంలో సీజన్ 2 విన్నర్ ఎవరు అవుతారో అని ఉత్కంట నెలకొంది. కానీ ఇప్పటికే ఫినాలే కి సంబంధించిన  షూటింగ్  కంప్లీట్ అయిపోయింది. 

దీంతో టైటిల్  విన్నర్ అమర్ - తేజస్విని అని లీక్ బయటకు వచ్చింది. ఇది ఇలా ఉంటే .. శ్రీముఖి ప్రస్తుతం స్టార్ మా లో ఎక్కువగా షోలు, స్పెషల్ ఈవెంట్లు హోస్ట్ చేస్తుంది. ఆదివారం విత్ స్టార్ మా పరివారం, నీతోనే డాన్స్ 2.0 వంటి షోలు చేస్తుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios